ప్రచారం తప్ప రక్షణలేదు అని జగన్ సర్కారును ప్రశ్నించిన: పవన్‌ కల్యాణ్

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేందుకే దిశ చట్టం తీసుకొచ్చాం, దిశ స్టేషన్లు పెట్టామంటూ ప్రభుత్వం కేవలం ప్రచారమే తప్ప మహిళలపై దాష్టీకాలు తగ్గలేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ విమర్శించారు. గిరిజనులపై దాష్టీకాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకొనేందుకు పోలీసులు ఎందుకు ఆలోచిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళల మానప్రాణాలకు రక్షణ లేదన్నారు. గిరిజన మహిళ మంత్రూభాయిని అధికార పార్టీకి చెందిన ఓ వడ్డీ వ్యాపారి ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేయడం అమానవీయమని పవన్‌ కల్యాణ్ అన్నారు. ఆ ఘటన గురించి తెలుసుకొంటే హృదయం ద్రవించింది. మృతురాలి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.