ఉత్తరాంధ్ర నుండి పవన్ కళ్యాణ్ కి పట్టంకట్టేందుకు సిద్ధం: ముక్క శ్రీనివాస్

ఎన్నారై జనసేన నాయకులు వేణు ఆధ్వర్యంలో రాజేష్ అద్యక్షతన శనివారం ఉత్తరాంధ్ర జనసేన నాయకులు ముక్క శ్రీనివాస్ తో జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ దేశాల నుండి ఎన్నారై జనసేన నాయకులు పాల్గొని వారు అడిగిన ప్రశ్నలకు ముక్క శ్రీనివాస్ సమాధానమివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముక్క శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో జనసేనకి గ్రాఫ్ బాగా పెరిగిందని ఉత్తరాంధ్ర నుండి పవన్ కళ్యాణ్ కి పట్టంకట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, ఉత్తరాంధ్రలో కరుడుగట్టిన జనసైనికులు ఉన్నారని తెలిపారు. జనసేన పార్టీకి ఎన్నారైలు చేస్తున్న సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా ఎన్నారై జనసేన నాయకులకు ధన్యవాదములు తెలిపారు. జనసైనికుల మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు ప్రజలందరూ బయటికి వచ్చి ప్రశ్నించాలని వారిని చైతన్యపరుస్తున్నామని తెలుపుతున్నామని తెలిపారు. రానున్న ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. బీజేపితో జనసేనకు సత్సంబంధాలున్నాయని, ఇది చెడుకి మంచికి మద్య జరుగుతున్న యుద్ధమని తెలిపారు. ముక్క శ్రీనివాస్ ని తప్పుగా చూపించేందుకు మాత్రమే ఆయన ఇంటిపై వైసిపి నాయకులు దాడికి ప్రయత్నించారని అయితే వారి ప్రయత్నం ఫలించనివ్వలేదని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఓట్లను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని తెలియజేస్తున్నామని తెలిపారు. ఇటీవల విశాఖలో జరిగిన అరెస్టులలో జనసేన నాయకులను ఇబ్బంది పెట్టారని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జనసేన నాయకులు సమ్యమనం పాటించారని తెలిపారు. భవిష్యత్తులో చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా నాయకుల మద్య మనస్పర్ధలు లేకుండా అందరూ కలిసి పోరాడితే ఖచ్చితంగా విజయం సాధిస్తామని తెలిపారు. జగన్ కి నిజంగా ఉత్తరాంధ్రమీద ప్రేమ ఉంటే శ్రీకాకుళాన్ని రాజధానిగా చేయాలని, అపుడు వలసలను అరికట్టవచ్చని తెలిపారు. ఉత్తరాంధ్రపై కపట ప్రేమని ప్రజలు నమ్మరని తెలిపారు. బూత్ మేనేజ్మెంట్ మీద శ్రద్ధ పెట్టాలని తెలిపారు. సమయం సందర్భం చూసి జనసేనలో బలమైన నాయకులు చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మార్పు మొదలయ్యిందని తెలిపారు. ప్రజలు కూడా బ్యాలెట్ తో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని తెలిపారు.