అరకు ప్రమాదంపై పవన్‌కల్యాణ్ దిగ్భ్రాంతి

అరకు ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి అరకు పర్యటనకు వెళ్ళినవారు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురికావడం విషాదకరం.. 30 మందితో ఉన్న బస్సు లోయలో పడిపోవడంతో 8 మంది మృత్యువాత పడ్డారని తెలిసింది.. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు తగిన పరిహారం ఇవ్వాలి. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులైన పర్యాటకులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారులు సమన్వయం చేసుకొని మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి’ అని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.