పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి పట్టాభిషేకం పక్కా: డాక్టర్ యుగంధర్

*గంగాధర్ నెల్లూరులో గెలుపు గ్యారెంటీ

*కార్వేటినగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలి

కార్వేటినగరం మండలం, కెఎం పురంలో జనసైనికుల కోసం జనసేన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ.. జనసేనకు రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతోందని, పవన్ కళ్యాణ్ ఆదరించేవారు, అభిమానించే వారు, ముఖ్యమంత్రిగా చూడాలనుకునేవారి సంఖ్య రోజురోజుకూ.. పెరుగుతోందని, ఆయన చేసిన సేవా కార్యక్రమాలే పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేస్తుందని, ప్రజలు ఈ సారి పట్టాభిషేకం చేయడం పక్కా అని ఉద్ఘాటించారు. అదేవిధంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జనసేన గ్యారెంటీ గా గెలుస్తుందని తెలిపారు. జనసైనికుల కోసం జనసేన కార్యక్రమంలో జనసైనికులు అందరూ ఏకతాటిపై నిలబడాలని, నిస్వార్ధ పరులు, దేశోద్ధారకులు అయిన, నిజమైన స్వాతంత్ర యోధులకు వారసులైన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చెయ్యకపోతే ఈ రాష్ట్రం మరో రావణ కాష్టం అవుతుంది అని తెలియ చేశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మేలు చేయగలిగిన వ్యక్తి, యువతకు సరైన దిశానిర్దేశం చేయగలిగిన వ్యక్తి, ఏక తాటిపై నడిపించ కలిగిన వ్యక్తి, యువతను సొంత కాళ్ళ మీద నిలబెట్ట గలిగినటువంటి వ్యక్తి, సౌభ్రాతృత్వం కోసం, దేశ సమగ్రత కోసం, రాష్ట్రాన్ని ఉద్ధరించ గలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఉద్బోధించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేసుకోవలసిన ఆవశ్యకత ఉందని తెలిపారు. మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే పవన్ కళ్యాణ్ వారికి అండగా నిలబడ్డారని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం కావటానికి ఒక బృహత్తర ప్రణాళిక జనసేన పార్టీ కలిగి ఉందని, ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవలను కొనియాడారు. కార్వేటినగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలని సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు విజయ్, లోకేష్, సురేష్ రెడ్డి, హర్షిత్ రాజు, బుజ్జి, ప్రధాన కార్యదర్శులు వెంకటేష్, కార్యదర్శులు అన్నమలై, నగర అధ్యక్షులు రాజేష్, కార్యదర్శులు గోపి, నాయకులు శేఖర్, చంద్ర, యోగి, మహేంద్ర, యుగంధర్, బాలాజీ, జనసైనికులు పాల్గొన్నారు.