తాడిత పీడిత వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలనేదే పవన్ కళ్యాణ్ ఆశయం

◆ సమస్య ఏదైనా ఉంటే మాకు తెలియపరచండి వెంటనే స్పందిస్తాం.
◆ రాజకీయ పార్టీలు ప్రజాసేవకు వేదికలు మాత్రమే.
◆ క్రియాశీలక సభ్యత్వ నమోదులో రాజానగరం నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.
◆ జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను వైసిపి అడ్డుకునేందుకు కుట్ర చేస్తుంది, నియోజకవర్గం నుండి వేలాదిగా తరలివెళ్లి జనసేన సత్తా చూపిద్దాం.
◆ రాజానగరం నియోజకవర్గంలో వనరులను దోచుకుతింటున్న వైసీపీ నాయకులకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు.
◆ స్వతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందిస్తున్న గొప్ప మహానీయుడు పవన్ కళ్యాణ్.
◆ ‘జనహితమే మా మతం – మానవత్వం మా కులం’

రాజానగరం, “జనంకోసం జనసేన – మహాపాదయాత్ర” 88వ రోజు, ఆడపడుచులకు బొట్టు పెట్టే కార్యక్రమంలో భాగంగా కోరుకొండ మండలం, ‘కోటి’ గ్రామంలో రెండవ రోజు రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, వీరమహిళలు, జనసేనశ్రేణుల ఆధ్వర్యంలో నిర్విరామంగా నిరాటంకంగా మహిళల విశేష ఆధారణతో ముందుకు కొనసాగింది. ఈ సందర్భంగా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ మహాపాదయాత్రను ఈస్థాయిలో ఆదరిస్తున్న కోటి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు, నియోజవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తెలియపరిస్తే వెంటనే స్పందించి ఆదుకుంటామని, ప్రజాసేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చామని, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అడ్డుకునేందుకు వైసిపి శతవిధాల ప్రయత్నిస్తుందని, నియోజకవర్గం నుండి వేలాదిగా తరలివెళ్లి జనసేన సత్తా ఏంటో చూపిద్దామని, రాజానగరం నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వాల నమోదులో రాష్ట్రంలో మన నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలబెట్టినందుకు జనసేన నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, రాజానగరం నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేని ఈ ఎమ్మెల్యేకి వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయారని, అసలు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతారని, చెరువులు, కొండలు, గుట్టలు, ఇసుక, మట్టి దోపిడీ లక్ష్యంగా పెట్టుకుని కోట్లు దండుకుంటున్న ఎమ్మెల్యేకి ప్రజల బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, ఈసారి జనసేన పార్టీ పట్టడానికి రాజానగరం నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియపరుస్తూ రానున్న రోజులు అత్యంత కీలకం కాబట్టి ప్రతి జనసైనికుడు అప్రమత్తంగా ఉండి ఒక్కో జనసైనికుడు పదిమందిని ప్రభావితం చేసేలా కష్టపడాలని, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి గుర్తింపు తప్పనిసరిగా ఉంటుందని, సమిష్టిగా అందరూ కష్టపడి ఇక్కడ జనసేన జెండా ఎగరవేద్దామని పిలుపునిస్తున్న అని అన్నారు. కోటి గ్రామంలో ఉత్సాహంగా కొనసాగిన ‘మహాపాదయాత్ర’లో జనసేన సీనియర్ నాయకులు, వీరమహిళలు, కోటి గ్రామ జనసేన యూత్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.