పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి: గురాన అయ్యలు

విజయనగరం, జనసైనికులంతా ఎన్నికల సంగ్రామానికి సిద్ధంగా ఉండాలని, క్రమశిక్షణతో జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని గురాన అయ్యలు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జనసేన నేత గురాన అయ్యలు కార్యాలయంలో గురువారం నిర్వహించారు. కేకు కట్​ చేసి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహం నందు అన్నదానం చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను తమ పార్టీ ఎండగడుతుందన్నారు. 2024 ఎన్నికలే తమ పార్టీకి అజెండా అని తెలిపారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో తమ నాయకుడికి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు. వైసీపీ ఎన్ని బీరాలు పలికినా, రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి విజయం సాధించడం ఖాయమన్నారు. ప్రజలను రక్షించడం కోసం మూడు పార్టీల కలయిక అవసరమన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని మొదటి నుంచి చెబుతూ వస్తున్న పవన్‌ కల్యాణ్‌ మాటలు నేటికి కార్యరూపం దాల్చుతున్నాయన్నారు. కూటమిని ఏర్పాటు చేయడంలో ఆయన చురుకైన పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు ఆదాడ మోహన్ రావు, కాటం అశ్విని,పితాల లక్ష్మీ, దుప్పాడ జ్యోతి, టి.రామకృష్ణ, వజ్రపు నవీన్ కుమార్, ఏంటి రాజేష్, ఎల్ .రవితేజ, పి.రవీంద్ర, పిడుగు సతీష్, ఎమ్. శ్రీను,సిరిపురపు దేవుడు,యడ్ల భాస్కరరావు, అభిలాష్, ఎమ్.పవన్ కుమార్, రంగూరి భరత్, పృథ్వీ భార్గవ్, గొల్లపల్లి మహేష్, వెంకటరమణ, కె.సాయి, కంది సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.