పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి

* విశాఖపట్నంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
‘జన సైనికులంతా ఎన్నికల సంగ్రామానికి సిద్ధంగా ఉండాలి. క్రమశిక్షణతో జనసేన పార్టీ సిద్ధాంతాలను, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి’ అని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ఆదివారం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం, 32 వ డివిజన్లో పర్యటించారు. కార్పొరేటర్ శ్రీ కందుల నాగరాజు ఆధ్వర్యంలో తయారు చేయించిన ప్రచార రథాన్ని శ్రీ మనోహర్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ప్రతి జన సైనికుడు తన పరిధిలో ఉన్న పోలింగ్ బూత్ ల్లోని ఓటర్ల వివరాలపై జాగురకతతో ఉండాలి. ఎప్పటికప్పుడు పాలకులు తమకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను జాబితా నుంచి తీసివేసే చర్యలను పసిగట్టాలి. ఎంతో క్రమశిక్షణతో పార్టీ కోసం రోజులో కనీసం రెండు గంటలైనా కేటాయించండి. ఓ గొప్ప ఆశయం సాధించడానికి జన సైనికులంతా తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి బలం బలగం జన సైనికులు, వీర మహిళలే. ఉత్తరాంధ్ర రాజకీయ పరిస్థితులపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక స్పష్టమైన ప్రణాళికతో ఉన్నారు. ఉత్తరాంధ్ర కుటుంబ పాలనకు చరమగీతం పాడేలా, నవ నాయకత్వం వచ్చేలా ఆయన చేస్తున్న ప్రయత్నానికి మనమంతా సహకరించాలి. జనసైనికులకు, వీర మహిళలకు ఏ అవసరం వచ్చిన పార్టీ తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం” అన్నారు. ఈ సమావేశంలో పి ఏ సీ సభ్యులు కోన తాతారావు, పార్టీ అధ్యక్షులు వారి రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ నేతలు సందీప్ పంచకర్ల, పీవీఎస్ఎన్ రాజు, వంపూరు గంగులయ్య, శ్రీమతి అంగ దుర్గా ప్రశాంతి, శ్రీమతి భీశెట్టి వసంత లక్ష్మి, శ్రీమతి నాగలక్ష్మి, శ్రీమతి కిరణ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.