మర్రపు సురేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలు

  • పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల పోస్టర్ రిలీజ్

విజయనగరం జిల్లా, గజపతినగరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మర్రపు సురేష్ ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మర్రపు సురేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు అందరూ వచ్చి జయప్రదం చేస్తారని కోరుకుంటున్నానని కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. తేది:27/8/2022 నుండి 2/9/2022 వరకు, వారం రోజులపాటు, జన్మదిన వారోత్సవాలు ప్రతిరోజు ఒక కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. మొదటి రోజు మొక్కలు నాటే కార్యక్రమం. రెండవ రోజు సర్వమత ప్రార్థనలు ప్రత్యేక పూజలు, మూడవరోజు వైద్య శిబిరం ఉచితంగా మందులు పంపిణీ మరియు టెస్టులు, నాలుగవ రోజు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ, ఐదవ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు రొట్టి పంపిణీ, అరవ రోజు రక్తదాన శిబిరం, ఏడవ రోజు జన్మదిన వేడుకలు, కేక్ కటింగ్ మరియు ఊరేగింపుతో పుట్టినరోజు వేడుకలు, అనంతరం మధ్యాహ్నం భోజనం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు రవికుమార్ మిడతాన, గజపతినగరం నాయకులు ఆదినారాయణ, పండు, శ్రీను హరీష్, మహేష్, సురేష్ పాల్గొన్నారు.