పవన్ కల్యాణ్ నిర్ణయమే కాపులకు శిరోధార్యం

  • కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం
  • అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాపుజాతి
  • ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి ప్రతీకలు కాపులు
  • పెమ్మసాని, గళ్లా మాధవి గెలుపును ఆపే శక్తి ఎవరికీ లేదు
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకునే ఎటువంటి నిర్ణయమైనా కాపులకు శిరోధార్యమని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గళ్లా మాధవిని కాపు నేతలు, వీరమహిళలు కలిసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక, రాక్షస పాలన నుంచి ప్రజల్ని రక్షించేందుకు పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కాపులు ముందుకు సాగుతున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్ త్యాగనిరతిని దళిత, ముస్లిం, బీసీ వర్గాలతో పాటూ కాపులు అర్ధం చేసుకోవటం ఎంతో హర్షణీయమన్నారు. పవన్ కల్యాణ్ లాంటి పోరాటాయోధుడు, దేశభక్తుడు తమ జాతిలో పుట్టడం గర్వకారణమని కాపు జాతి యావత్తు చెప్పుకుంటుందన్నారు. పవన్ కల్యాణ్ పిలుపుమేరకు సమాజంలోని దళిత, ముస్లిం, బీసీలను కలుపుకొని వారికి ప్రాధాన్యతనిస్తూ కాపులు పెద్దన్న పాత్ర పోషించటం ఎంతో ముదావహం అన్నారు. కాపులంతా కూటమి అభ్యర్థుల వెంటే ఉన్నారన్నారు. కాపుల్లో చీలిక తీసుకురావాలని, వారిని ప్రలోభాలకు గురిచేయాలని కొందరు ప్రయత్నాలు చేయటం వృధా ప్రయాస అంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్లా మాధవి విజయాన్ని ఆపే శక్తి ఎవరికి లేదని ఆళ్ళ హరి అన్నారు. కూటమి అభ్యర్థి గళ్లా మాధవి మాట్లాడుతూ పొత్తు ధర్మంలో భాగంగా జనసైనికులు, వీరమహిళలు, కాపు సోదరులు అందరూ తనకు అండగా నిలవడం ఎంతో సంతోషకరమన్నారు. కాపులు ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి ప్రతీకలని కొనియాడారు. రాష్ట్రంలో కాపులందరూ పవన్ కల్యాణ్ వెంటే నడుస్తున్నారని వారిలో ఎక్కడా భేదాభిప్రాయాలు లేవన్నారు. ప్రచారంలో భాగంగా తాను ఎక్కడికి వెళ్లినా జనసైనికులు, వీరమహిళలు చూపిస్తున్న ఆదరణను తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేననన్నారు. జనసేన, కాపుల సంపూర్ణ మద్దతుతో తాను భారీ మెజారిటీ సాధిస్తానని గళ్లా మాధవి అన్నారు. తొలుత గళ్లా మాధవికి శ్రీకృష్ణ దేవరాయల చిత్రపటాన్ని వీరమహిళలు అందచేశారు. కార్యక్రమంలో జనసేన నగర ఉపాధ్యక్షురాలు కటకంశెట్టి విజయలక్ష్మి, హరి సుందరి, శిరీష, కాపు నేత డేగల వెంకటేశ్వర్లు, రెల్లి నేత సోమి ఉదయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు, సయ్యద్ షర్ఫుద్దిన్, గుర్రాల ఉమ, దాసరి వెంకటేశ్వరరావు, దళవాయు కిషోర్, లక్ష్మణ్, పవన్ వెంకి, లక్ష్మిశెట్టి నాని, పసుపులేటి నరసింహరావు, నండూరి స్వామి, అడపా చైతన్య గిరి, అడపా బాలకృష్ణ, స్టూడియో బాలాజీ, వడ్డె సుబ్బారావు, కలవల సత్యనారాయణ, తాడికొండ శ్రీను, పుల్లంసెట్టి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.