రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం చారిత్రక అవసరం

  • అవినీతి, అరాచకత్వం, నియంత పాలనతో కునారిల్లుతున్న రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ మాత్రమే దిక్కు
  • మన బిడ్డలు, భవిష్యత్ తరాలు బాగుండాలి అంటే జనసేన అధికారంలోకి రావటం ఒక్కటే మార్గం
  • కులమతాల బేధం లేని, అవినీతిరహిత పాలన జనసేనతోనే సాధ్యం
  • పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు, తమ అసమర్ధ, అవినీతి, అరాచక, నియంత, అవగాహనారాహిత్య పాలనతో వైసీపీ నేతలు రాష్ట్రాన్ని రావణకాష్టం చేసారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నతమైన ఆశయాలతో, అత్యున్నతమైన సిద్దాంతాలతో పాటూ నిశ్వార్థ సేవతో ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ నాయకత్వం ఈ రాష్ట్రానికి చారిత్రక అవసరమని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. మంగళవారం శ్రీనివాసరావుతోటలోని శ్రీవీరాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో జరిగిన 22 వ డివిజన్ జనసేన పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాగర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆళ్ళ హరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఆ క్షణం నుంచి రాష్ట్రంలో ఏ ఒక్క వర్గ ప్రజలు సంతోషంగా లేరని ఆందోళన వ్యక్తం చేశారు. తమ స్వార్ధం కోసం అన్ని వ్యవస్థల్ని వైసీపీ నేతలు కునారిల్లింప చేశారని విమర్శించారు. తమ రాజకీయ స్వలాభం కోసం రాష్ట్రాన్ని కులాల వారీగా మతాల వారీగా ప్రాంతాల వారీగా విభజించి రాష్ట్రాన్ని మరో బీహార్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో విలువలకు వలువలు తీసేసి భూతుల సంస్కృతిని తెచ్చిన వైసీపీ నేతలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టిన చీడపురుగుల్లా తయారయ్యారని దుయ్యబట్టారు. సంక్షేమం పేరుతో అలవికాని అప్పులు తెస్తూ చారిత్రక సంపదను తెగనమ్ముతూ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని ధ్వజమెత్తారు. ప్రజలకు పప్పుబెల్లలు పంచిపెడుతూ ఇసుక, మైనింగ్ వంటి సహజ సంపదను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన దృష్ట్యా తమ బిడ్డలు బాగుండాలి అన్నా ముందు తరాల వారికి బంగారంలాంటి భవిష్యత్ కావాలన్నా ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ఒక్కడు మాత్రమే దిక్కని అన్నారు. కులమత భేదాలు లేని, అవినీతిరహిత ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ప్రజలు జనసేన పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. నిస్వార్థమైన సేవకు నిలువెత్తు నిదర్శనమైన పవన్ కళ్యాణ్ కి ఒక్క అవకాశం ఇస్తే గాడితప్పిన పరిపాలనను పూర్తిగా సరిదిద్ది రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తాడన్నారు. జనసైనికులు, వీర మహిళలు, వివిధ విభాగాల పార్టీ శ్రేణులు పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ భావజాలాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింతగా చేరువ చేయాలని కోరారు.కార్యక్రమంలో చెన్నా పోతురాజు, కోనేటి ప్రసాద్, షర్ఫుద్దీన్, త్రిపుర, రవీంద్ర, కోలా చిరంజీవి, మెహబూబ్ బాషా, లక్ష్మిశెట్టి నాని, సుబ్బారావు, రాము, చిరంజీవి, సురేంద్ర, నరేష్, కుమార స్వామి, యుసూఫ్, రాసంశెట్టి శ్రీను, సాయి తదితరులు పాల్గొన్నారు.