పిఠాపురంలో పవన్ ప్రభంజన ర్యాలీ- పుణ్య పాదగయ క్షేత్రంలో పవన్ వారాహి పేరిట ప్రత్యేక పూజలు..

జూన్ 14న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్రలో భాగంగా జూన్ 15న పిఠాపురం నియోజకవర్గంలో ప్రవేశిస్తున్న సందర్భంగా, నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ కు తమ ఆశీస్సులు అందజేయాలని పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మాకినీడి శేషుకుమారి పేర్కొన్నారు. శనివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన పాదగయ ఆలయంలో పవన్ కళ్యాణ్ వారాహి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి, నాయకులు, జనసైనుకులు సమక్షంలో వారాహి యాత్ర స్టిక్కర్ ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడ నుండి పిఠాపురం టౌన్ లో పుణ్యమంతుల సూర్యనారాయణమూర్తి, పిండి శ్రీను, మేళం రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ బైక్, ఆటో ర్యాలీ పుర వీధులలో ప్రజల ఆనందాల మధ్య చేసారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మాకినీడి శేషుకుమారి మాట్లాడుతూ.. చారిత్రాత్మక పీఠికాపురంలో కొలువైయున్న పురూహితిక అమ్మవారి అనుగ్రహంతో శక్తి స్వరూపాల్లో ఒకటైన వారాహి, శత్రు సంహరణ కు మారు పేరుగా ఋషి పుంగవులు వర్ణిస్తారని, అంతటి మహోన్నతమైన విశిష్టత కలిగిన వారాహి వాహనంపై అబద్ధపు హామీలతో మోసానికి గురైన ఆంధ్ర రాష్ట్ర జనం ఎదుర్కొంటున్న సమస్యల్ని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన యాత్రలో భాగంగా పిఠాపురం వస్తున్న పవన్ కళ్యాణ్ కు నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున స్వాగతం పలికాలని ఆమె కోరారు. శనివారం చేపట్టిన బైక్, ఆటో ర్యాలీ పిఠాపురం పట్టణంలో యువతను ఉర్రూతలీగించిందని అదే ఉత్సాహాన్ని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పిఠాపురం నియోజకవర్గం పొలిమేర దాటే వరకూ ప్రతి రోజు పండుగ వాతావరణం నెలకొనే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలు, వీరమహిళలు, నాయకులూ పాలుపంచుకోవాలని ఆమె సూచించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వివిధ వర్గాలతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని, వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పాడ మండల ప్రెసిడెంట్ పట్టా శివ, రూరల్ నాయకుడు గోపి సురేష్, జిల్లా కార్యదర్శులు మొగలి అప్పారావు చీకట్ల శ్యామ్ కుమార్, టౌన్ మహిళా ప్రెసిడెంట్ కోలా దుర్గ, గౌర అధ్యక్షులు కర్రి కాశీ విశ్వనాథ్, కసిరెడ్డి నాగేశ్వరరావు, పెదిరెడ్ల భీమేశ్వరరావు, కొత్తపల్లి మండల ప్రెసిడెంట్ పట్టా శివ, గోపు సురేష్, కేతినిడి గౌరీ నాగలక్ష్మి, వినుకొండ అమ్మాజీ, ఖండవల్లి సూర్యకుమారి, యండ్రపు శ్రీనివాస్, గొల్లపల్లి గంగ, వెలుగు లక్ష్మణ్, పెనుగొండ వెంకటేశ్వరరావు, లంక పూర్ణ, దొడ్డి దుర్గాప్రసాద్, మెరుగు ఇజ్రాయిల్, పెద్దింటి శివ, బుద్దాల చంటి, అల్లం కిషోర్, పబ్బినిడి దుర్గాప్రసాద్, నామ శ్రీకాంత్, దేశరెడ్డి సతీష్, కంద సోమరాజు, రౌతు శివ బాబు, గంటా బాబీ, పిట్ట చిన్న, పెనుపోతుల నాని బాబు, స్వామి రెడ్డి అంజి, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.