పవన్ రావాలి- పాలన మారాలి

  • పార్వతీపురంలో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు
  • దేవాలయాలలో ప్రత్యేక పూజలు
  • పార్వతీపురం నుండి బలిజిపేట వరకు బైక్ ర్యాలీ
  • వారోత్సవాలను నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం: పవన్ రావాలి పాలన మారాలి అని జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు కోరారు. శనివారం పార్వతీపురం నియోజకవర్గంలో పట్టణంలో జనసేన పార్టీ వ్యవస్థాపకులు కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఆగూరుమని అక్కివరపు మోహనరావు, వంగల దాలి నాయుడు, ఖాతా విశ్వేశ్వర రావు, చిట్లి గణేష్, గుంట్రెడ్డి గౌరీ శంకర్, బోనెల గోవిందమ్మ, లలిత, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, అల్లు రమేష్, సూర్య, కర్రి మణి, తదితరుల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయం, శ్రీ దుర్గాదేవి దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024లో ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేయాలని కోరినట్లు తెలిపారు. జనసేనాని పుట్టినరోజు సందర్భంగా అన్నదానం, వస్త్ర దానం, మొక్కల పంపిణీ, తాపీ పని వారితో సహపంక్తి భోజనం, రెల్లి పేటలో పుట్టినరోజు వేడుకలు, రక్తదానం తదితర కార్యక్రమాలను చేపట్టి వారోత్సవాలు నిర్వహించామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల బాగుకోసం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్నారు. ప్రస్తుతం వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల పాలయిందని, ధరలు పెరిగాయని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నారన్నారు. విద్యా, వైద్యం, రవాణా, వ్యవసాయం ఇలా వ్యవస్థలన్నీ నాశనమయ్యాయన్నారు. ఈ సందర్భంగా పట్టణ మెయిన్ రోడ్డులో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నర్సిపురంలో కేకు కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం సీతానగరం మీదుగా బలిజిపేట వరకు నియోజకవర్గంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజు, అక్కేన భాస్కరరావు, అంబటి బలరాం, దుర్గాప్రసాద్, కేశవ, మహేష్, డి.కె.పట్నం, గోచెక్క, ఎమ్మార్ నగరం, మరికి, లిడికివలస, హిందూపురం, డికిశీల, నర్సిపురం తదితర గ్రామాలకు చెందిన జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.