ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే పవన్‌ వారాహి యాత్ర

నందిగామ: రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు, ఆ సమస్యల పరిష్కారానికి తగిన ప్రణాళికలు రూపొందించేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు చేపట్టనున్న వారాహి యాత్ర విజయవంతం కావాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నుంచి చేపట్టనున్న వారాహియాత్ర విజయవంతం కావాలని కోరుతూ మంగళవారం నందిగామ మండల జనసేన పార్టీ అధ్యక్షులు కొడుకుగంటి రామారావు దంపతులు మరియు నందిగామ మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షురాలు చలమల సౌందర్య దంపతుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మండలంలోని అంబరుపేట గ్రామంలో జాతీయ రహదారి పక్కన గల సత్యమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హజరత్ సయ్యద్ బాలే మస్తాన్వలి దర్గా, గిల్గావ్ ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందులకు స్వస్తి పలికేందుకు వారాహి ద్వారా ప్రజల ముందుకు వస్తున్నారని బుధవారం అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధి నుండి వారాహి యాత్ర ప్రారంభం కానుందని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న వెతలు యాతనలు స్వయంగా తెలుసుకునేందుకే జనసేనపార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ వారాహియాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో అన్ని వ్యవస్థల నిర్వీర్యంతో ప్రజానీకం తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని, ప్రజలకు నేనున్నానంటూ భరోసా కల్పించేందుకు పవన్‌ చేపట్టిన యాత్రకు ప్రభుత్వం ఎటువంటి అడ్డంకులు కలిగించిన ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. వారాహి యాత్ర ప్రకటన రాగానే వైసీపీ నాయకుల్లో వణుకు మొదలైందని వారాహియాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నదని, రెట్టించిన ఉత్సాహాంతో యాత్రను విజయవంతం చేస్తామని వారు తెలిపారు. వైసిపిముక్తాఆంధ్ర ప్రదేశ్ కేవలం పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమని ఎప్పుడైతే ఈ రాష్ట్రం నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని పారధ్రోలుతామో అప్పుడే ఈ రాష్ట్రంలో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని, అవినీతి పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరుగుతుందని, అదే విధంగా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయని, తద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే గొప్ప సంకల్పంతో పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి వారాహి యాత్ర విజయవంతం కావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చందర్లపాడు మండల అధ్యక్షులు వడ్డెలి సుధాకర్, వీరులపాడు మండల అధ్యక్షులు బేతపూడి జయరాజు, నందిగామ నియోజకవర్గ నాయకులు సురా సత్యనారాయణ, ఆకుల వెంకట్, రామిరెడ్డి వెంకటేశ్వరరావు, రామిరెడ్డి గోపికృష్ణ, కటారపు జయరాజు, మార్కపుడి భాస్కరరావు, ఉప్పు మధుబాబు, తానూరి సుధాకర్ గోపి, తానూరి రమేష్ కృష్ణ, నందిగామ మండల రూరల్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.