పవనన్న చేనేత బాట-చీరాల నియోజకవర్గం 43వ రోజు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో, రాష్ట్ర చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సూచనలతో ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ సలహాలతో పవనన్న చేనేత బాట-చీరాల నియోజకవర్గం 43వ రోజు క్షేత్రస్థాయి పర్యటన కర్ణ కిరణ్ తేజ్ ఆధ్వర్యంలో వేటపాలెం మండలం, దేశాయి పేట పంచాయతీలో పర్యటించడం పూర్తయింది.

ఈ కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికులు మాట్లాడుతూ హ్యాండ్లుమ్ రంగానికే చెందిన 21 రకాలలో (జి ఓ పరంగా ఇచ్చిన) పవర్లుమ్(పవర్ లూమ్) వాళ్ళు 11 రకాలు అనధికారకంగా యంత్రాల మీద నేయిస్తు చేనేత రంగ కార్మికులు కుదేలు అయ్యేతట్టు చేస్తున్నారు అని అభిప్రాయ పడినారు.

జనసేన యువ నాయకులు మాట్లాడుతు చేనేత కార్మికులు పడుతున్నా సమస్యలను రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి స్థానికంగా ఎదురు కుంటున్న సమస్యలు, రెండు చేనేత రంగం పరంగా ఎడురుకుంటున్న సమస్యలు. స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు చీరాల నియోజకవర్గ అధికార ప్రతినిధుల సహకారంతో పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. చేనేత రంగం పరంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు చిల్లపల్లి శ్రీనివాసరావు ద్వారా పవన్ కళ్యాణ్ గారికి నివేదించి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన యువ నాయకులు పసుపులేటి సాయి (పందిళ్ళపల్లి), వరం బూడిద (చేనేతపురి), సంతోష పింజల (నీలకంఠాపురం), పృథ్వీ శ్రీహరీ (దంతం పేట), సాయి పల్లపొలు (పందిళ్ళపల్లి), శ్రీను (పందిళ్ళపల్లి) పాల్గొన్నారు.