సేవాగుణం, నాయకత్వ లక్షణం కలగలిపితే పవనిజం

  • టెన్త్ విద్యార్థులకు పరీక్షల కిట్లను పంపీణీ చేసిన కార్యక్రమంలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, పవనిజం అంటే సేవాగుణం, నాయకత్వ లక్షణం కలిగి ఉండటమే పవనిజం అన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. శనివారం తిరుపతిలో బెంగుళూరు పవన్ కళ్యాణ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పదో తరగతి విద్యార్థులకు కిట్ లు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ సామాజిక సేవ చేయాలన్న పవన్ కళ్యాణ్ ఆలోచనలు పుణికి పుచ్చుకొని యువత ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తోందన్నారు. సేవతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా యువతకు చాలా అవసరం అన్నారు. సమాజ ప్రక్షాళన కోసం పవన్ కళ్యాణ్ నటించిన ఎన్నో సినిమాలను కోట్లాది మంది యువత ఎలా ఆదరించిందో రాజకీయ ప్రక్షాళన కోసం ఆయన చేస్తున్న పోరాటానికి యువత అంతా ఆయనతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ అంటేనే ధైర్యం అని, యువత ఆ ధైర్యాన్ని పుణికి పుచ్చుకొని నాయకత్వ లక్షణాలను అలవరుచుకోవాలన్నారు. బెంగుళూరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అవినాష్ రాయల్ మాట్లాడుతూ అన్ని పార్టీలు ఓటర్లకు ప్రలోభాలు పంపిణీ చేసి రాజకీయం చేస్తుంటే పవన్ కళ్యాణ్ అభిమానులైన తాము మాత్రం టెన్త్ విద్యార్థులకు పరీక్షల కిట్ లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి ఆనంద్, బాటసారి, నగర కమిటీ లక్ష్మి, కిరణ్ కుమార్, రవి, హేమంత్, కిరణ్ పురుషోత్తం, పురుషోత్తం రాయల్, సాయి, నవీన్, మనోజ్, బెంగళూరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అవినాష్ అవినాష్ వంక – అధ్యక్షుడు , అవినాష్ రాయల్ – వైస్ ప్రెసిడెంట్, సాయి వినయ్ – సెక్రటరీ, నరసింహ – సంయుక్త కార్యదర్శి, యాసిన్ – కోశాధికారి, ఫైజాన్, షేక్ ఫిజల్, అనంత కళ్యాణ్, జ్యోతిష్, శివుడు, నవీన్, అన్వేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.