ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించండి లేనియెడల ఉద్యమమే

*ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల కష్టాలపై మొసలి కన్నీళ్లు కార్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అన్ని విధాల మోసం చేస్తుంది వైసిపి ప్రభుత్వం.
*రైతు భరోసా కేంద్రాలు రైతు సమస్య కేంద్రాలుగా మారిపోయాయి.

పెడన నియోజకవర్గంలో రైతులకు ధాన్యం డబ్బులు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ధాన్యం అమ్మి మూడు నెలలు కావస్తున్నా ఇప్పుడు వరకు డబ్బు చెల్లించలేదు. ఈ సంవత్సరం దాళ్వా లేకపోవడంతో రైతులు అపరాలు వేయడం జరిగింది. అకాల వర్షాలతో చాలావరకు మినుము పంట దెబ్బ తిన్నాయి. ఒకవైపు దాళ్వా పంట లేక, మరోవైపు అపరాలు దెబ్బతిని ఈ సంవత్సరం రెండిటికీ చెడ్డ రేవడి లాగా ఉంది రైతు పరిస్థితి. తాము అధికారంలోకి వస్తే మూడు రోజుల్లో ధాన్యం డబ్బులు చెల్లిస్తానని నమ్మబలికి అధికారం వచ్చిన తర్వాత మాట తప్పిన ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. రైతులను ఇబ్బందులు పెట్టడంలో దళారులను మించిపోయింది వైసీపీ ప్రభుత్వం. ధాన్యం సేకరించి మూడు నెలలైనా ఇప్పటివరకు పట్టించుకునే నాథుడే లేదు. రేపు మాపు అంటూ కల్లబొల్లి మాటలతో కాలయాపన చేస్తున్నారే తప్ప స్పష్టమైన ప్రకటన చేయడంలేదు. వారంలోగా దాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయకపోతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రైతుల తరపున క్షేత్రస్థాయిలో ఉద్యమానికి జనసేన పార్టీ సిద్ధం. పెడన నియోజకవర్గం రైతుల తరపున ఎలాంటి పోరాటానికైనా నేను సిద్ధం. మా నియోజవర్గ రైతులకు వారంలోగా దాన్యం డబ్బులు చెల్లించకపోతే నిరాహార దీక్షకు సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు సమ్మెట అన్నారు.