పీఈసెట్ ఫలితాలు

రాష్ట్రవ్యాప్తంగా బీపీఈడీ, డీపీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం గతనెలలో నిర్వహించిన పీఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఇవాళ విడుదలచేశారు.

ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ pecet.tsche.ac.inలో అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెల 29న రాతపరీక్షను, అందులో అర్హత సాధించిన వారికి నవంబర్‌ 7న Fitness test ను నిర్వహించారు. ఈ పరీక్షలకు 7,368 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఏడాది పీఈ సెట్‌ను మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహించింది.