పెడన నియోజకవర్గాన్ని పేకాట క్లబ్బుగా మార్చారు: యడ్లపల్లి రామ్ సుధీర్

  • అక్రమ మైనింగులు.. పేకాట క్లబ్బులు.. కబ్జాలు..
  • ప్రశ్నించే వారిపై దాడులు చేయించడం..
  • నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ చేసిన అభివద్ధి ఇదే
  • పెడన పేకాట శిభిరంలో మంత్రి వాటా ఎంత?
  • మున్సిపల్ ఛైర్మన్ భర్త పేకాట నిర్వహిస్తుండడమేంటి?
  • కళాశాల ఛైర్మన్ పేకాడుతూ దొరకడం ఏంటి?
  • మున్సిపల్ ఛైర్మన్ రాజీనామా చేయాలి.. మంత్రి బాధ్యత వహించాలి
  • కేసుని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు మానుకోవాలి
  • పేకాట శిభిరంలో మంత్రికి వాటా లేకపోతే ప్రకటన చేయాలి
  • వైసీపీ అక్రమాలపై జనసేన పార్టీ పోరాటం చేస్తుంది
  • త్వరలో గడప గడపకు తిరిగి మీ అక్రమాలు ఎండగడతాం

పెడన నియోజకవర్గాన్ని పేకాట క్లబ్బులకు అడ్డాగా మార్చిన ఘనత మంత్రి జోగి రమేష్ కే దక్కుతుందని పెడన నియోజకవర్గం జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ ఎద్దేవా చేసారు. ఈ సందర్భంగా రామ్ సుధీర్ మాట్లాడుతూ స్వయంగా మున్సిపల్ ఛైర్మన్ భర్త ఆధ్వర్యంలో పేకట క్లబ్బు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడడం వైసీపీ నాయకులు ప్రజలకు ఏం చెప్పాలనకుంటున్నారు?. ఏ ముఖం పెట్టుకుని ప్రజల్ని ఓట్లడుగుతారు?. పెడన మున్సిపాలిటీ పరిధిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా?. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సెటిల్మెంట్ల వరకు వెళ్లిన జోగి రమేష్ మంత్రి అయ్యాక గుడివాడ మాజీ మంత్రిని ఆదర్శంగా తీసుకుని పేకాట క్లబ్బులు మొదలు పెట్టినట్టున్నారు. ఏప్రిల్ 30వ తేదీ పేకాట శిభిరంపై జరిగిన దాడిలో దొరికిన బళ్లా గంగయ్య స్వయానా మున్సిపల్ ఛైర్మన్ భర్త, బట్ట దివాకర్ బొడ్డు నాగయ్య కళాశాల ఛైర్మన్. అధికార పార్టీ నాయకులు ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. కళాశాల ఛైర్మన్ అంటే విద్యార్ధుల్లో స్ఫూర్తి నింపే స్థాయిలో ఉండాలి. భావి భారత పౌరులకు వైసీపీ నింపాలకుంటున్న స్ఫూర్తి ఇదేనా?. అక్రమంగా మట్టి, ఇసుక మైనింగ్ ద్వారా జేబులు నింపుకోవడం.. మడ అడవులు అడ్డంగా నరికేసి వందల ఎకరాల్లో చెరువులు తవ్వేసుకోవడం, ప్రభుత్వ భూముల కబ్జాలు.. ప్రశ్నించే వారిపై దాడులు చేయడం మంత్రి జోగి రమేష్ తొమ్మిదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి పెడన నియోజకవర్గంలో సాధించిన అభివృద్ధి ఇదే. మున్సిపల్ కార్పోరేషన్ భర్త పేకాట శిభిరం నిర్వహిస్తూ దొరికిని దానికి ఎవరు బాధ్యత వహిస్తారు?. మున్సిపల్ ఛైర్మన్ రాజీనామా చేయాలి. మంత్రి జోగి రమేష్ ఈ పేకాట నిర్వహణకు బాధ్యత వహించాలి. పేకాట శిభిరం వ్యవహారంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వీరిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఉన్నాయి. కేసుని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గం పరిధిలో ఏం జరిగినా తన కనుసల్లోనే జరిగే విధంగా చూసే జోగి రమేష్ కి ఈ పేకాట శిభిరంతో సంబంధం లేదనడం హాస్యాస్పదం. నిజంగా తనకు ఈ పేకాట శిభిరంలో వాటా లేకపోతే మంత్రి జోగి రమేష్ ఈ కేసు మీద ప్రకటన చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ అక్రమాలపై.. ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేన పార్టీ పోరాటం చేస్తుంది. త్వరలో పెడన నియోజకవర్గం మొత్తం గడప గడపకు తిరిగి వైసీపీ అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం. ప్రజా కంఠక పాలకులకు బుద్ది చెబుతాం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో ముందుకు వెళ్తాం అని రామ్ సుధీర్ తెలియజేసారు.