పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించిన పీలేరు జనసేన

పీలేరు నియోజకవర్గం, చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి, పీలేరు మండల అధ్యక్షులు మోహన్, కే.పల్లి అధ్యక్షులు మహేష్, పీలేరు మండల ప్రధాన కార్యదర్శి జి ధన శేఖర్ పవన్, మండల కార్యదర్శి ధనంజయ్ విఘ్నేష్ వీర మహిళ గాయత్రి మరియు మనీ విష్ణు కార్యకర్తలు జనసైనికులు నిరసన తెలియజేయడం జరిగింది. ఆంధ్రాలో రాక్షసి పాలన జరుగుతున్న నేపథ్యంలో రాత్రి జనసేన పార్టీ అధినేత రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలంగాణ నుంచి ఆంధ్రకి మంగళగిరి ఆఫీస్ కి వెళ్తుండగా అడ్డగించిన విధానం తీవ్రంగా ఖండిస్తున్నాము. మా పీలేరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున మా జనసైనికులు మా వీర మహిళలు మా కార్యకర్తలు ఈ వైసీపీ దాస్టికాన్ని ఈ అరాచక రౌడీ రాజకీయాన్ని నిరసన తెలుపుతూ మా పార్టీ అధినాయకునికి మద్దతు తెలుపుతున్నామని ప్రజా పక్షాన అఖండ ప్రజా ప్రభంజనం కలిగిన పవన్ కళ్యాణ్ నిలువురించే ధైర్యం ఈ వైసిపి ప్రభుత్వానికి గాని పోలీస్ యంత్రాంగానికి గాని లేదు ప్రజా సంరక్షణ కోసం నిలవవలసిన పోలీస్ యంత్రాంగం వైసీపీ తొత్తులుగా మారి ఏకపక్ష వైఖరిని పూర్తిగా ఖండిస్తున్నామని రౌడీ రాజకీయానికి అద్దం పడుతుంది వైసీపీకి బాయ్ బాయ్ చెప్పే రోజులు దగ్గరలో ఉందని, హిట్లర్ నియంత పోకడల్ని పునికిపుచ్చుకున్న మన 6093 సీఎం ఇకనైనా పాలన పోవాలని అన్నారు.