జనసేనకు అవకాశం ఇచ్చి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్ధాం: బండారు శ్రీనివాస్

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో జనసేనకు అవకాశం ఇచ్చి నూతన ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్ధామని కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో జనసేనపార్టీ, గ్రామ అధ్యక్షులు ఎర్రంశెట్టి రామ్మోహన రావు (రాము) అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనం బాటలో జనసేన, జనసేనకు అవకాశం ఇద్ధాం పాదయాత్రలో భాగంగా జనసేనపార్టీ కొత్తపేట నియోజక వర్గం ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొని అలుపెరగని ప్రయాణంతో గడపగడపకు తిరుగుతూ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు,ఆశయాలను వివరిస్తూ ఉండగా ఈ పాదయాత్రలో కనీవిని ఎరుగని రీతిలో జనసైనికులు మేము సైతం అంటూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలలో రాష్ట్రమంతటా విజయంతో పాటుగా నియోజకవర్గం ఎమ్మెల్యేగా బండారు శ్రీనివాసుని గెలిపించి తీరుతామని మహిళలు అధిక సంఖ్యలో పూలవర్షం కురిపిస్తూ, మంగళ హారతులతో ఇంటింటికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ 2024 ఎన్నికల వరకు జనం బాటలో జనసేన పాదయాత్ర నియోజకవర్గ స్థాయిలో నాలుగు మండలాలలో కొనసాగుతుందని, రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీని దీవించి ఆశీర్వదిస్తారని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళ డేవిడ్, జిల్లా కార్యదర్శులు, సంగీత సుభాష్, చేకూరి కృష్ణంరాజు, దొంగ సుబ్బారావు, ఎంపీటీసీ బొరుసు సీతారత్నం సుబ్రహ్మణ్యం, బొక్కా ఆదినారాయణ, మండల కన్వీనర్ తోట స్వామి, అంబటి కిషోర్, నంబూరి రవి కుమార్, గుత్తుల నాగేశ్వరరావు, చింతపల్లి సత్తిపండు, పంపన సురేష్, పిల్లి శంకరం, గుత్తులు శ్రీనివాస్, కుడుపూడి శ్రీనివాస్, కట్టరాజు, చల్లా బాబి సిరిగినేడి పట్టాభి, చల్లా వెంకటేశ్వరావు, జనసేన, కొత్తపల్లి నగేష్, భావన శివశంకర్, గారపాటి త్రిమూర్తులు, తమ్మన భాస్కరరావు, పడాల అమ్మిరాజు, ఉండ్రాజు వెంకన్న, జనసైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.