పలు సమస్యలపై ఎం.అర్.ఓ కి వినతి పత్రం అందజేసిన పెనగలూరు జనసేన

జనసేన పార్టీ ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో పెనగలూరు మండలం లో పలు సమస్యలపై ఎమ్మార్వో గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ముఖ్యంగా సిద్ధావరం వెళ్లే రోడ్డు మార్గంలో భూవ్యవసాయ డి.కే.టి భూముల కబ్జాకి సహకరిస్తున్న అధికారపక్ష నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఈ సమస్యపై ఎమ్మార్వో మరియు ప్రభుత్వ అధికారులు స్పందించాలని కోరడం జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర మాట్లాడుతూ.. నవంబర్ 19న వరదలకు కొట్టుకుపోయిన సిరివరం, ఎన్.ఆర్ పురం ప్రజల వ్యవసాయ పంట నష్ట పరిహారం ఇప్పటివరకూ పట్టించుకోని అధికారులు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

అలాగే కోడూరు నాయకులు అనంత రాయల్ మాట్లాడుతూ.. చెరువు కట్ట తెగి 6 నెలలు అయినా పట్టించు కోవడంలేదని విమర్శించారు.

చిట్వేలు జనసేన నాయకులు మాదాసు నరసింహులు మాట్లాడుతూ అమాంతంగా పెరిగిన విద్యుత్ చార్జీల దెబ్బ కి సామాన్యుడి జేబులో పైసా మిగలని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

కోడూరు నాయకులు పగడాల చంద్ర మాట్లాడుతూ.. గ్రామాలలోకి సరైన రోడ్లు కూడా లేని పరిస్థితి వుంది అని విమర్శించారు.

ఆలం రమేష్ మాట్లాడుతూ.. మండలం పొడవునా చేయేరు ఇసుక ఉన్నా.. అధికారపక్ష ఇసుక మాఫియా వల్ల సొంత గ్రామస్తులకి కూడా ఇసుక అందుబాటులో లేకుండా చేశారని విమర్శించారు.

రైల్వేకోడూరు నాయకులు వరికూటి నాగరాజు మాట్లాడుతూ.. రైతుల దగ్గర నుంచి పంట కొనుగోలు చేస్తాం అని చెప్పి.. ప్రభుత్వం మాట తప్పిందని.. రైతు భరోసా ద్వారా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

పెనగలూరు జనసేన మండల నాయకులు పూజారి మనీ మాట్లాడుతూ.. సామాన్యుడిని నిత్యం బయపెడుతున్న నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

పెనగలూరు నాయకులు గొబ్బూరు హరి మాట్లాడుతూ.. జీవన ఉపాధి లేక.. వున్న ఊరిని వదిలి గల్ఫ్ దేశాలకి వలసలు పోతున్న యువకులకు.. ఇక్కడే ఉద్యోగావకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పెనమలూరు జనసేన పార్టీ తరఫున ఎమ్మార్వో ఈ సమస్యలు పరిష్కరించకపోతే రిలే ధర్నా చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకట రమణ, ఎర్ర జొన్న శ్రీనివాసులు, కొనిశెట్టి ప్రసాద్, రాయల్ కంచర్ల సుధీర్ రెడ్డి, పగడాల శివ, ఏనుగుల శివ, మోడం శీను, నెల్లూరు రవి, మారం రెడ్డి పవన్, కోనేటి శివయ్య మరియు పెనగలూరు జనసేన కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-04-13-at-5.07.04-PM-1024x461.jpeg