జనసేన ఆవిర్భావ సభలో గాయపడ్డ మహిళకు ఆర్థిక సాయం అందించిన పెండ్యాల శ్రీలత

మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని జనసేన పార్టీ తరపున13వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసిన వీరమహిళ శ్రీదేవి ప్రమాదవశాత్తూ గాయపడడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత గాయపడిన వీరమహిళ శ్రీదేవిని పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకొని 10 వేల రూ. ఆర్థికసాయం అందించారు.

ఈ సందర్భంగా పెండ్యాల శ్రీలతమాట్లాడుతూ.. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ పెద్ద ఎత్తున విజయవంతం అయినప్పటికీ ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని శ్రీదేవి జనసేనపార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నందువల్ల వైద్య బీమా కింద 50వేల రూపాయలు వచ్చే విధంగా చూస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అను కోని ప్రమాదాలు జరిగినప్పుడు జనసేన కార్యకర్తలకు, వీర మహిళలకు ఆర్థిక తోడ్పాటును అందించే విధంగా క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రవేశపెట్టారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు కాశెట్టి సంజీవ రాయుడు, సురేష్, సంయుక్త కార్యదర్శులు శివ, పెనుగొండ మండల అధ్యక్షుడు మహేష్, సోమందేపల్లె అధ్యక్షులు జబిబుల్ల వీర మహిళలు కాసెట్టి సావిత్రి, శిల్ప, తేజలక్ష్మి, శిరీష నాయకులు తోట ప్రకాష్, టి.ఎన్ అంజి, కొండిశెట్టి ప్రవీణ్, లోకేష్, శివ శంకర్, విష్ణు, వెంకటేష్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-03-17-at-12.28.39-PM-1024x576.jpeg