పెడనలో పెన్షన్ టెన్షన్…

  • అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి.. లేనియెడల పెన్షనర్లకు జనసేన పార్టీ అండగా ఉంటుంది

పెడన: అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని, పెన్షన్ల కోత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పెడన జనసేన నాయకులు ఎస్.వి.బాబు డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బర్తడే మరుచటి రోజే పెన్షనర్లకు షాక్ ఇచ్చిందని చెప్పాలి. అనేక కుంటి సాకులతో పెన్షన్లు లబ్ధిదారులను భారీగా తొలగించే ప్రయత్నానికి వైసిపి ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా శ్రీకారం చుట్టింది, ఇంటి స్థలం ఎక్కువ ఉందని, నాలుగు చక్రాల వాహనం ఉందని, విద్యుత్ బిల్లు 300 యూనిట్లకు మించి వస్తుందని, ఇంట్లో ఇన్కమ్ టాక్స్ కట్టే వ్యక్తులు ఉన్నారని, ఇంకా రకరకాల కారణాలతో పెన్షన్ లబ్ధిదారులను తగ్గించాలని వైసీపీ ప్రభుత్వం వ్యూహాలను సిద్ధం చేస్తుంది. కొత్త సంవత్సరం నుంచి పెన్షన్ పెంచుతున్నట్టు కలరింగ్ ఇస్తూ, మరోపక్క పెన్షన్ లబ్ధిదారులను భారీగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. సచివాలయం నుండి వాలంటీర్ల ద్వారా నోటీసు అందుకున్న పెన్షన్ లబ్ధిదారులు ఆందోళనలో ఉన్నారు. పెద్దవారికి నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేయటం సరైన పద్ధతి కాదు, ఇచ్చిన నోటీసులు వెంటనే ఉపసంహరించుకోవాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని, లేనియెడల పెన్షనర్లకు అండగా జనసేన పార్టీ ఉంటుందని, వారి తరఫున ఎలాంటి పోరాటానికైనా జనసేన పార్టీ సిద్ధం.