డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ కి పెనుగొండ జనసేన ఘన నివాళి

పెనుగొండ మండలం, ములపర్రు శివారు, మద్దిగుంట చెరువు గ్రామంలో గురువారం ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ మండల కమిటీ మంద. నవీన్ ( నాని) మరియు పెనుగొండ ఎస్.ఐ బండి. మోహన్ రావు మరియు జనసేన నాయకులు జనసైనికులు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండలం లో ఎస్.ఐ బండి మోహన్ రావు నిర్వహిస్తున్న కర్తవ్యం మరియు సేవలకు గాను అభినందనలు తెలియజేస్తూ.. సన్మానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.