ప్రమాదవశాత్తూ గాయపడిన వీరమహిళకి మనోధైర్యాన్నిచ్చిన పెనుకొండ జనసేన

అనంతపురం, పెనుకొండ, మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని జనసేన పార్టీ తరపున 13వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసిన వీరమహిళ శ్రీమతి శ్రీదేవి ప్రమాదవశాత్తూ గాయపడడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి సురేష్, పెనుకొండ నియోజకవర్గ నాయకులు అనిల్ కుమార్, వెంకటేష్, పొగతోట వెంకటేష్, హరి తదితరులు శ్రీదేవి యోగక్షేమాలు తెలుసుకొని రూపాయలు 5000/- ఆర్థికసాయం అందించారు అలాగే శ్రీదేవి కొడుకు చదువుకి కూడా అనీల్ కుమార్ సహాయం చేస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే జనసేన తరపున ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కదిరి మునికుమార్ పెనుకొండ నాయకులు లోకేష్ తదితరులు పాల్గొన్నారు.