వైసీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

  • సంస్కారహీనుల్లా వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నేతలు
  • పవన్ కళ్యాణ్ చెప్పింది చిలక జోస్యం కాదు ప్రజా జోస్యం
  • 2024 ఎన్నికల్లో 24 సీట్లకే వైసీపీ పరిమితం అవుతుంది.
  • మెగా కుటుంబంలో విభేదాలు తీసుకురావడం ఎవరివల్లా కాదు.
  • సానుభూతి కోసం కుటుంబసభ్యులనే బలి తీసుకున్న చరిత్ర వైసీపీది.
  • అవసరం తీరాక తల్లి, చెల్లినే తరిమేసిన నీచుడు మీ ముఖ్యమంత్రి.
  • రాజధానిగా అమరావతే ఉండాలంటూ అసెంబ్లీ సాక్షిగా నాడు చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదా?
  • రాష్ట్రంలో అడుగడుగునా అధికార దుర్వినియోగం జరుగుతుంది.
  • వైసీపీ దుర్మార్గపు పాలనతో ప్రజలు విసిగిపోయారు.
  • ప్రజల్లో మార్పు మొదలైంది అందుకే వైసీపీలో వణుకు మొదలైంది.
  • జనసేన అధికారంలోకి వచ్చాక వైసీపీ అవినీతి నేతల్ని జైలుకు పంపుతాం.
  • జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి మైనారిటీ నాయకులు షేక్ నాయబ్ కమాల్

గుంటూరు, రాష్ట్రంలో జరుగుతున్న అరాచక, అవినీతి, అసమర్ధ పాలనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్న వైసీపీ నేతలు సంస్కార హీనుల్లా వ్యక్తిగత విమర్శలకు దిగటం సిగ్గుచేటని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి పేర్ని నాని వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర కార్యదర్శి షేక్ నాయబ్ కమాల్, జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావుతో కలిసి సోమవారం జిల్లా ప్రధాన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బోనబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని, వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉండారన్నారు. రాముడికి లక్ష్మణుడిలా చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఉంటారని, మెగా కుటుంబంలో కుట్రపూరితంగా విభేదాలు సృష్టించటం ఎవరివల్లా కాదన్నారు. సానుభూతి కోసం సొంత కుటుంబ సభ్యులనే బలి తీసుకున్న చరిత్ర మీ అధినాయకుడిదన్నారు. అవసరం తీరాక కన్నతల్లిని, సొంత చెల్లినే పక్క రాష్ట్రానికి తన్ని తరిమేసిన మీరు మెగాఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. జనసేన అధికారంలోకి వచ్చాక వైసీపీ అవినీతి నేతలను కటకటాల్లోకి పంపిస్తామని బోనబోయిన శ్రీనివాస్ అన్నారు. మైనారిటీ నాయకులు షేక్ నాయబ్ కమాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, నిరుద్యోగులు, సామాన్యులు ఎవరూ కూడా ప్రశాంతంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని, వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ మీద కన్నా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. బీజేపీ సంకలో ఎవరున్నారో కేసుల భయంతో మోడీ ముందు సాగిలపడింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడగానే విమర్శించటానికి వైసీపీలోని పేర్ని నాని లాంటి ఐటమ్ రాజాలు, బఫూన్ లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని విమర్శించారు. తమ అధినేత వేసే కుక్క బిస్కట్ల కోసం తమని తాము అమ్ముకునే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారని దుయ్యబట్టారు. పేర్ని నాని మంత్రిగా విఫలమయ్యాడని, రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. అమరావతిని రాజధానిగా అంగీకరిస్తూ అసెంబ్లీ సాక్షిగా వై యస్ జగన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం ముందుతరాల వారికి బంగారు భవిష్యత్తు అందించటం కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న మహా ప్రయత్నానికి ప్రజల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుందన్నారు. ప్రజల్లో మార్పు మొదలైందని అందుకే ఓటమి భయంతో వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైందని గాదె వెంకటేశ్వరరావు అన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లిక, ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, దళిత నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు, నగర కార్యదర్శి తన్నీరు గంగరాజు తదితరులు పాల్గొన్నారు.