జగన్ రెడ్డి గురించి మాట్లాడకూడదా?: అనందరావు

  • మంత్రి విశ్వరూప్ వ్యాక్యలకు మాజీ ఎమ్మెల్యే అనందరావు ప్రతి స్పందన

కోనసీమజిల్లా, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో విమర్శించారు. దానికి ఆనందరావు ప్రతి స్పందించారు. స్థాయి గురించి మాట్లాడుతున్నావు. అసలు నీ స్థాయి ఏమిటి?? ఎస్ కె బి ఆర్ కాలేజీ వద్ద నుంచి మాట్లాడితే రాజకీయాల్లో వచ్చేవరకు మీ స్థాయి నాకు తెలుసు.
40 ఎకరాలు లీజుకు తీసుకుని ఆక్వా సాగు చేసిన వ్యక్తే భారీ అవినీతి చేస్తే హైదరాబాద్ లో 500 కోట్ల ఫ్యాక్టరీ, భూములు ఎక్కడ నుంచి వచ్చాయి అంటూ అనందరావు అన్నారు. నీవు చంద్రబాబు గురించి మాట్లాడవచ్చు. నేను జగన్ రెడ్డి గురించి మాట్లాడకూడదా?? నీ గొప్ప ఏమిటి.. రేపు నేను గెలిస్తే నీవు ఎక్కడ అసెంబ్లీ కూర్చున్నావో అక్కడ కూర్చుంటా. నా స్థాయి కూడా అదే అని సమాధానం ఇచ్చారు.