ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: డా. రవి కుమార్ మిడతాన

గజపతినగరం: ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని గంట్యాడ మండలం, బుడతనపల్లి గ్రామంలో జనసేన టిడిపి నాయకులు ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ జిల్లా నాయకులు డా. రవి కుమార్ మిడతాన అన్నారు. అందరూ కలిసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు కట్టుబడి ఉండాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాజీ ఎంపీపీ రంది రాము నాయుడు, అర్జున్ మాస్టర్, బూడతనపల్లి గ్రామం మాజీ సర్పంచ్,
గంట్యాడ జనసేన మండల కో-కన్వీనర్ బొమ్మడి ఏర్ని నాయుడు, జనసేన, టిడిపి నాయకులు కార్యక్తలు పాల్గొన్నారు.