ఇంటింటికి జనంలోకి జనసేన

  • ఇంటింటికి కరపత్రాలు అందజేస్తున్న జనసేన నాయకులు

రాజంపేట, సిద్ధవటం ఇంటింటికి జనంలోకి జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో సిద్ధవటం మండలం లోని మాధవరం-1 గ్రామ పంచాయతీల్లో పార్వతీపురం, రామకృష్ణాపురం గ్రామాల్లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ… ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా 15 వ రోజు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని జనసేన పార్టీ సిద్ధాంతాలను మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ప్రజలకు క్షేత్రస్థాయిలో తెలియాలనే ఉద్దేశంతో ఇంటింటికి వెళ్లి వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన రావడం అభినందనీయమన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన యువ నాయకుడు పోలిశెట్టి శ్రీనివాసులు, చంగల్ రాయుడు, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.