ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమా ఇకనైనా మేలుకోండి: చొప్పా చంద్రశేఖర్

సింగనమల: అనంతపురము జనసేన జిల్లా కార్యదర్శి చొప్పా చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. అద్వాన్నంగా ఉన్న రైతాంగ వ్యవస్థ బాగు పడాలంటే.. సరైన గిట్టుబాటు ధర ఇచ్చే మార్కటింగ్ వ్యవస్థ ఉండాలి. కొండ గుట్టలకు లోను తీసుకునే దొంగ రైతు భక్షకుల నుంచి సొసైటీ వ్యవస్థను కాపాడాలి. ఏ ప్రాతంలో ఏరకమైన పంటలు పండుతాయో వాటిని ముడి సరుకుగా వాడే పరిశ్రమలు నెలకొల్పాలి.. నకిలీ విత్తనాలు, పురుగుల మందులు, ఎరువుల ను అమ్మే వారిపై కఠిన శిక్షలు ఉండాలి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులకు అధిక ధరలు లేకుండా ప్రభుత్వం సబ్సిడీ రూపంలో నియంత్రణ చేయాలి. ప్రకృతి విపత్తులు సంబంధించిన రైతు పెట్టుబడులు కనీసం 75% వరకూ ప్రభుత్వం చెల్లింపు చేయాలి. రైతులకు ప్రమాదం సంబంధించిన భీమా పరిహారం, ప్రభుత్వ సహాయం, వెంటనే చెల్లింపు చేయాలి. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే పాసుబుక్ ఉన్నవారికి కాకుండా నిజమైన వ్యవసాయం రైతులను, కౌలు రైతులను గుర్తించి వారి ప్రభుత్వ బార్ కోడింగ్ వుండే రైతు కార్డులు ప్రభుత్వం మంజూరు చేయాలి. వీటితోనే ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల సబ్సిడీలు ఉండాలి.. ఇవన్నీ చేస్తే తప్ప అప్పుల ఊబిలో ఉన్న అన్నం పెట్టె రైతుల ను కాపాడుకోలేం. అలాగే మన రాష్ట్రంలో బాధ్యత లేని పార్టీల ప్రభుత్వాల చేతిలో నలిగిన వ్యవస్థలు.. అద్వాన్నంగా ఉన్న కార్మిక వ్యవస్థ, కర్షక వ్యవస్థ, విద్యా వ్యవస్థ బాగు పడాలంటే.. అద్వాన్నంగా ఉన్న నిరుద్యోగులకు సరైన రీతిలో ఉద్యోగాలు రావాలంటే, ఉద్యోగుల జీత భత్యాలు సక్రమంగా రావాలంటే.. పారిశ్రామిక వ్యవస్థ బాగు పడాలంటే.. నీటి ప్రాజెక్టులు సరైన టైంకు పూర్తి కావాలంటే ముందు మనం మారాలి.. తండ్రిని చూసి కొడుకు కు, మామను చూసి అల్లుడి కి కాకుండా అతని వ్యక్తిత్వం.. నీతివంతమైన గుణం.. చూసి ఓటు వేయాలి.. నోటుకు మన ఓటు బలికాకుండా చూడాలి.. లిక్కర్ వ్యాపారస్థులను, గంజాయి ముఠాలను, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవారికి ఇసుక, ఎర్రమట్టి వంటి ప్రజల సంపదను దోచుకునే వారిని ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోకూడదు.. నీతి నిజాయితీ గల నాయకులను మనం ఎన్నుకోవాలి.. ఇలాంటి నాయకులను తయారు చేసే పార్టీ కేవలం జనసేన పార్టీ మాత్రమే.. ఇలాంటి ప్రజల క్షేమమే తన క్షేమంగా బావించే నాయకుఢు జనసేన పార్టీ అధ్యక్షుడు.. పవన్ కళ్యాణ్ మాత్రమే.. అందుకే ఓ మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమా ఇక నైనా మేలుకో నీ భవిష్యత్తు నీవే కాపాడుకో మిత్రమా గుర్తుంచుకో.. పాలన మారాలంటే పవన్ రావాలి అని చొప్పా చంద్ర శేఖర్ అన్నారు.