ప్రజలకు కనీస మౌళిక వసతులు కల్పించాలి: గాదె

  • అవగాహన కూడా లేకుండా తన శాఖ ఏంటో కూడా తెలియని క్రీడామంత్రి జబర్దస్ట్ రోజా తైతక్కలాడుతూ తిరుగుతుంది.

గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు నాయబ్ కమల్ గురువారం గుంటూరు నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంను సందర్శించారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఎంతో చరిత్ర ఉన్న స్టేడియం అని, ఒకప్పుడు అంతర్జాతీయ క్రీడలు జరిగిన ప్రాంతమని, అలాగే అంతర్జాతీయ క్రీడాకారులు తయారైన ప్రాంతమని అలాంటి ఈ ప్రాంతాన్ని పాలకులు నిర్లక్ష్యంతో అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మార్చేశారు. ఒకప్పుడు 24 ఎకరాలు ఉన్న ఈ స్టేడియం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద స్టేడియంగా ఉండేది. అలాంటి ఈ స్టేడియంలో సుమారు 8 ఎకరాలు పాటు ఆక్రమణకు గురైందని అన్నారు. ఈ స్టేడియంలో ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ సుమారు 10 నుంచి 15 వేలమంది వచ్చి వాకింగ్ లేదా క్రీడలు ఆడుకునే ప్రాంతమని, అలాంటి ఈ ప్రాంతంలో కనీసం మౌళిక వసతులు లేకుండా చిన్నపాటి వర్షానికి నీళ్లు నిలబడి సుమారు పది నుంచి 15 రోజులపాటు స్టేడియంలోకి వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. కొద్దిపాటి వర్షం పడగానే వాలీబాల్, క్రికెట్, బాస్కెట్ బాల్ కోర్టులలోకి, వాకింగ్ ట్రాక్ లోకి పూర్తిగా వాటర్ వస్తోంది. అలాగే స్టేడియంలోకి వచ్చే దారి కూడా అస్తవ్యస్తంగా ఉంది. పక్కన డంపింగ్ యార్డ్ కూడా పెట్టి ఉదయం పూట వాకింగ్ చేసుకుని ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న ప్రజలు రోగాల బారిన పడే పరిస్థితి తీసుకొని వచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కమిషన్ చైర్మన్ గా తమ వాళ్లకు ఇచ్చుకొని కార్లో తిరగడానికి, జీతాలు తీసుకోవడానికి తప్ప అభివృద్ధి మీద ధ్యాస లేదని ఎద్దేవా చేశారు. అలాగే ఈ రాష్ట్ర క్రీడామంత్రి రోజా గారికి టూరిజంతో పాటు క్రీడా శాఖ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఆవిడ ఉందని, కనీస మౌళిక వసతులు కల్పించాలన్న అవగాహన లేకుండా తైతక్కలాడుతూ తిరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం కూడా నియోజవర్గం స్టేడియం కట్టిస్తానని చెప్పి ఉన్నవారిని నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా వీటి మీద కనీస ధ్యాస పెట్టకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉంది. స్టేడియంలో కనీసం ఉండవలసిన సిబ్బంది కూడా అనగా ఫిజికల్ ట్రైనర్లు పీటీలు కూడా అందుబాటులో లేరని అన్నారు. ఇండోర్ స్టేడియం జిమ్ములు కూడా పూర్తిగా మూసివేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. అలాగే వీలైనంత త్వరగా స్టేడియం పనులు పునరుద్ధరించాలని లేకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయవలసి ఉంటుందని హెచ్చరించారు. లేనిపక్షంలో రాబోయే జనసేన ప్రభుత్వం అని ప్రజల మౌలిక సదుపాయాల మీద, ఇలాంటి క్రీడా ప్రాంగణాల మీద ప్రత్యేక శ్రద్ధ నిర్వహించబడిన అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ప్రజలందరూ కూడా అభివృద్ధి చేస్తున్నామని మభ్యపెట్టి కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన వైఫల్యాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కార్యదర్శి నాయబ్ కమల్ మాట్లాడుతూ.. ఎంతమంది క్రీడాకారులు తయారుచేసిన ఈ బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఈరోజు ఈ దుస్థితిలో ఉండటానికి కారణం గత పాలకుల పరిపాలన వైఫల్యం అని, వచ్చేది జనసేన ప్రభుత్వం అని జనసేన పార్టీ హాయంలో బ్రహ్మానందరెడ్డి స్టేడియాన్ని తీర్చిదిద్ధి ఆదర్శంగా నిలిపి క్రీడా రంగానికి పెద్దపేట వేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లికా, నారదాసు రామచంద్ర ప్రసాద్, చట్టాల త్రినాథ్, పులిహరి, శిఖా బాలు, కార్పొరేటర్స్: యర్రంశెట్టి పద్మావతి, దాసరి లక్ష్మీ దుర్గ, పట్టణ నాయకులు: నెల్లూరు రాజేష్, కొత్తకోట ప్రసాద్, పసుపులేటి ఆంజనేయులు, కోడిగంటి రవికుమార్, ఆసియా, మల్లీశ్వరి, వార్డు అద్యక్షులు: మధు లాల్, జడ సురేష్, మాదాసు షేకర్, అశోక్, రోశయ్య, నర్సింహారావు, కదిరి సంజయ్, వీరమహిళలు రాజ్యలక్ష్మి, అనసూయ, మంత్రి రాహుల్ అండ్ యూత్, సలాం ఫ్రెండ్స్ యూత్, కట్ట అనిల్, గోపిశెట్టి సాయి తదితరులు పాల్గొన్నారు.