యువత ఉద్యోగ అవకాశాలను గాలికొదిలిన వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలి

  • స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక బలమైన వ్యవస్థగా జనసేన పార్టీ మారనుంది
  • సరిహద్దులో జవానుకు ఉన్నంత దేశభక్తి ప్రతి జనసైనికులకి ఉంది

నెల్లూరు సిటీ సుబేదారు పేట నందు గల జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కార్యాలయంలో 20 మంది యువత జనసేన పార్టీలోకి చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం సచివాలయం ఉద్యోగులకు కానీ ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు గాని ఏ మాత్రం ఆటంకం కలిగించబోరు. వ్యవస్థకు ఉన్న జవాబుదారీతనాన్ని పెంచేందుకే ప్రజా ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి. సొంత ఆర్జిక ప్రయోజనాలకో మరే ఇతర ప్రలోభాలకు లొంగి పార్టీ మారిన ఒకరిద్దరి వల్ల జనసేన పార్టీకి గాని పవన్ కళ్యాణ్ గారికి కానీ నష్టం కలగదు…
యువతను సరైన మార్గంలో నడిపించగి రాష్ట్ర అభివృద్ధిని సాధించగల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గారే అని తెలుసుకున్న యువత ఎప్పటికీ జనసేన పార్టీతోనే ఉంది…
సొంత ప్రయోజనాల కోసం కాక రాష్ట్ర అభివృద్ధి కోసం అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ గారి దిశా నిర్దేశాన్ని అనుసరించి ప్రజా ప్రభుత్వానికి గెలిపించేందుకు ఆయా నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులకు గెలుపుకు తామంతా కృషి చేస్తాం. గత నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగం లేక అల్లాడుతున్న యువతకు ప్రజా ప్రభుత్వంలో సరైన అవకాశాలు కల్పించబోతున్నారు. జనసేన పార్టీలో ఎంతమంది చేరినా కూడా వారికి సరైన గుర్తింపు లభించేటట్లుగా ప్రజల పక్షాన పోరాడే ఒక శక్తిగా యువకులను జనసేన పార్టీ పెద్దలు తీర్చిదిద్దుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేరిన ప్రసాద్, మహేష్, లక్ష్మయ్య, నారాయణ తదితర యువతను జనసేన పార్టీలోకి మోటివేట్ చేస్తున్న యువ నాయకులు ప్రసన్న, హేమచంద్ర యాదవ్, షాజహాన్, మౌనిష్, ప్రశాంత్ గౌడ్ ను వారు అభినందించారు.