తిరుపతి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేస్తా: వరప్రసాద్

తిరుపతి: బిజెపి తిరుపతి అసెంబ్లీ పరిచయ వేదికకు తిరుపతి లోక్ సభ బీజీపీ అభ్యర్థి వరప్రసాద్, తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు జనసేన జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారీగా హాజరైన బిజెపి నాయకులు, కార్యకర్తలు. కార్యకర్తలకు ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులు వరప్రసాద్, ఆరణి శ్రీనివాసులును బీజీపీ నేతలు పరిచయం చేసారు. ఈ సందర్భంగా వరప్రసాద్, తిరుపతి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరు, అవినీతి మరక అంటని పార్టీ బిజెపి ప్రధాని మోదిని ఏ సమయంలోనైనా కలిసే వీలు ఉంది బిజెపి సర్వే చేశాకే నాకు తిరుపతి ఎంపి సీటు కేటాయించింది. జగన్ అరాచక విధానాలు నచ్చకే పార్టీని వీడా జగన్ ఎస్సీలను వాడుకుని వదిలేశాడు, ఎస్సీలకు ఒకసారి టికెట్ ఇస్తే మరోసారి అవకాశం ఇవ్వలేదు 27మంది దళిత ఎమ్మెల్యేలను జగన్ మార్చాడు. పార్టీలో, ప్రభుత్వంలో పదవులన్నీ రెడ్లకే ఇచ్చాడు సామాజిక న్యాయం పేరుతో బీసీలను వాడుకుని వదిలేసాడు, కేవలం దళితుడైనందునే నన్ను ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే నుంచి ఇంటికి పంపాడు. జగన్ కు దళితులు ఓట్లు కావాలి వారికి పదవులు మాత్రం ఇవ్వడు. పవన్ కళ్యాణ్ గారు వయస్సులో చిన్నవాడైన చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. బిజెపి తిరుపతి ఎంపి టికెట్ రావడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది. పవన్ కళ్యాణ్ యువశక్తి, చంద్రబాబు అనుభవం, మోది అభివృద్ధి మంత్రం బీజీపీ, టిడిపి, జనసేన అభ్యర్థులను గెలిపిస్తుంది. నన్ను గెలిపిస్తే ఐ ఎ ఎస్ అధికారిగా ఉన్న అనుభవంతో తిరుపతి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేస్తా అని తెలియచేసారు.
వైసీపీని ప్రజలు చిత్తు చిత్తుగా ఒడిస్తారు అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జనసేన,తెలుగుదేశం, బీజీపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ ఆరని శ్రీనివాసులు మాట్లాడుతూ రాయాలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో 72 సీట్లు ఉంటే బలిజలకు ఒక్క సీటు ఇవ్వనటువంటి వ్యక్తి జగన్ రెడ్డి రిజర్వ్ సీట్లు మినహా అన్ని సీట్లు రెడ్లకు మాత్రమే కేటాయించారు. తిరుపతి ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది కచ్చితంగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి జెండా తిరుపతి పార్లమెంట్, అసెంబ్లీ లో ఎగరడం ఖాయం అని తెలియచేసారు. పవన్ కళ్యాణ్ యువశక్తి, చంద్రబాబు నాయుడు అనుభవం, మోది అభివృద్ధి మంత్రంతో తిరుపతిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాము రాష్ట్రంలో అభివృద్ధి ఎదైనా జరిగింది అంటే అది కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే జరిగింది. జగన్ ప్రభుత్వం రాష్ట్ర నిధులతో ఒక్క రోడ్డులో గుంతను కూడా మరమ్మత్తు చేయలేదు. ప్రజలు జనసేన, తెలుగుదేశం, బీజీపీ కూటమిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు జగన్ పార్టీని ప్రజలు ఇంటికి ఇంటికి పంపేందుకు నిర్ణయం తీసేసుకున్నారు. తిరుపతి ఎంపిగా వరప్రసాద్ గారిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి, రిటైడ్ ఐఏఎస్ రత్నప్రభ, సామంచి శ్రీనివాసులు బీజేపీ ముఖ్యనాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.