ప్రజల సమస్యలను గాలికి వదిలేసారు: ముఖరం చాన్

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని తిట్టేయడం అధికారం వచ్చాక రివెంజ్ గా ప్రతిపక్షాన్ని తిట్టేస్తూ ప్రజల సమస్యలను గాలికి వదిలేయడం ప్రస్తుత అధికార వైసిపి పార్టీకి అలాగే ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా నిర్వర్తించలేని టిడిపి పార్టీ దుస్థితిని తెలియజేస్తుంది. సమాజంలో మాట్లాడే భాష ఎప్పుడు, ఎక్కడ మాట్లాడాలో కూడా కనీస అవగాహన లేని రాజకీయ పార్టీలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉండడం ఆంధ్ర ప్రజల దౌర్భాగ్యంగా రాష్ట్ర జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముఖరం చాన్ అభిప్రాయపడ్డారు. గత మూడు సంవత్సరాల గా అధికార వైసిపి చేస్తున్న ఆగడాలను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చూస్తూ కేవలం ప్రేక్షకపాత్ర వహించిందని ఒక్క జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చి వీరి దాష్టికాన్ని ప్రజల ముందర ఉంచారని చాన్ తెలియచేసారు. కేసులకు భయపడి ఈ మూడు సంవత్సరాలు మమ అనిపించేసిన తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు కేవలం ఈరోజు తమ మామ జయంతి సందర్భంగా మహానాడు పేరిట కేసులకు భయపడమని చెప్పడం, ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదం అని ముఖరంచాన్ చెప్పుకువచ్చారు. ప్రజలు రానున్న రోజులలో అధికారం కోసం ఈ రెండు పార్టీలు పడుతున్న పాట్లును రెచ్చగొట్టే మాటలు బూతుపురాణాలను గమనిస్తున్నారని రానున్న రోజులలో సరైన గుణపాఠం ఈ రెండు పార్టీ లకు ప్రజలు చెబుతారని ఆయన ఉపోద్ఘాతమిచ్చారు.