భూ హక్కును భక్షిస్తున్న- జగనన్న శాశ్వత (భూ బకాసుర) సర్వే

నెల్లూరు: ప్రభుత్వ భూములను పెద్దలు కాజేసేందుకు చేస్తున్న ప్రయత్నం లా అనిపిస్తుందని నిరసిస్తూ జనసేన పార్టీ శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కలెక్టరుకు ఫిర్యాదు చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. భూములు సర్వే చేసేటప్పుడు ఎమ్మార్వోలు గాని భూ పట్టణం హక్కు కలిగిన రైతులు కానీ దగ్గర ఉండాల్సిన అవసరం లేకుండా జరుగుతున్న ఈ సర్వేలో పారదర్శకత లేదు.. కేవలం డ్రోన్ లో ఎగరేసి భూ హక్కును నిర్ణయించడం పొరపాటు. విషయ పరిజ్ఞానం లేని వ్యక్తుల చేత 100 సంవత్సరాలు ముందు ఉన్న డైక్లాట్ ఆదారంగా పరిశీలించడం వలన కొన్ని భూములు అడవులుగాను కొన్ని ప్రభుత్వ స్థలాలుగాను రికార్డులు చూపటంతో హక్కుదారులు అల్లాడుతున్నారు. ఇరుపక్కల పొలాల వారు లేకుండా సర్వే జరగడం వల్ల పొరపాటుగా కొంత పొలం పక్కవారికి హక్కు కలిగినట్లుగా చూపి కలహలకు దారి తీస్తున్నాయి. కోవూరు నియోజకవర్గం గుట్టలమ్మ పాడు, దామాయుగుంట, కొత్త వంగళ్ళు గ్రామాలలో అనేకొ అవకతవకలు ఉండటంలోబ గ్రామాలంతా బగ్గుమంటున్నాయి. ఏదైనా గ్రామాలలో భూ సర్వే జరిగేటప్పుడు గ్రామ సభలు నిర్వహించి ఒక అవేర్నెస్ తీసుకువచ్చి భూ సర్వే జరిపించాల్సిన అవసరం ఉంది. సరైన విధంగా సర్వే జరుపుకుంటే మా జనసేన పార్టీ తరఫున రైతులకు అండగా నిలబడి నిరసనలు ఉధృతం చేస్తాం. ఈ నాలుగు నెలల్లో ఈ సమస్యను మీరు పరిష్కరించకపోతే జనసేన పార్టీ ప్రజా ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత గ్రామ సభలు నిర్వహించి,ఎమ్మార్వోని దగ్గర పెట్టుకొని హక్కుదారులకు న్యాయం జరిగేటట్లు ప్రయత్నిస్తాం. మీ భూమి మా హామీ అంటూ వైసిపీ పదకం సరిగా అమలవడం లేదు. గతంలో రికార్డులలో ఫోటోలు, పేర్లు సక్రమంగా నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేసి ఉన్నారు. పాసుబుక్కు కలిగి ఉన్న భూస్వాములు కూడా తమ భూమి ఏమవుతుందోనని భయాందోళనలో ఉన్నారు. భూవివాదాలు తగాదాలు లేకుండా తయారు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అసలు భూములు వారి పేరిట లేకుండా అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది. రెవిన్యూ వ్యవస్థ ప్రక్షాళన సరాసరి తమ కష్టపడి సంపాదించుకున్న భూములు ఏమవుతాయని ఆందోళనలో రైతులు ఉన్నారు. దోషాలు గుర్తించడం సరాసరి స్వాతంత్రం పూర్వం రికార్డులతో తమ భూములు కాదని తెలియజేసిన అధికారుల ముందు బాదితులు లబోదిబోమంటున్నారు. దాదాపు 100 సంవత్సరాల పూర్వం స్వాతంత్రం పూర్వం సర్వేల ఆధారంగా రికార్డు జరుగుతున్న కారణంగా అప్పటి రికార్డుల్లో ఉన్న ప్రభుత్వ భూములను, అడవులనీ అదే విధంగా సూచించడం శోచనీయం. కోవూరు నియోజకవర్గంలో కొత్త వెల్లంటి గ్రామంలో స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన భూములను కూడా ప్రభుత్వ భూములుగా ఆ రికార్డులు సర్వే ప్రకారం చెబుతున్నారు. ఈ సర్వే వలన కొంతమంది భూములు అసలు కనపడకుండా ప్రభుత్వ అధికారులు చూపడం, అసలు వారి పేరు మీద ఉండకపోవడం తరచుగా కనబడుతుంది. మరికొంత ప్రాంతాలలో అమ్మిన వ్యక్తులు మీదనే ఇంకను ఆ భూమి పత్రాలు ఉండడం వలన అమ్మకదారులకే హక్కులు ఉన్నట్లు చూపడం వలన వల్ల కొన్నవారు బాగా ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని చోట్ల పక్క పొలాల వారికి కొంత కలిసిపోయినట్లుగా చూపించడం వల్ల హక్కు కలిగినట్లుగా చూపిన వారు హక్కు దారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన భూములను సైతం మీ హక్కు చెల్లదు ఇది ప్రభుత్వ భూములుగా ఉన్నవి అని పాసుబుక్కు కలిగి ఉన్న రైతులను కూడా తెలుపుతున్నారు. కట్న కానుకల గాను, బహుమతులు గాను ఇచ్చి ఉన్న భూములు రికార్డుల్లో వారి పేరు మీద లేవనే సరికి కుటుంబ కలహాలకు సైతం కారణమవుతున్నాయి. పై సమస్యలు దృష్టిలో పెట్టుకొని జరుగుతున్న జగనన్న భూ సర్వే అవకతవకలు లేకుండా పాత రికార్డులను పట్టాదారులు పాస్ పుస్తకాలను, చట్ట ప్రకారం జరిగిన రిజిస్టర్ల రికార్డులను పరిగణలోకి తీసుకొని సర్వే జరిపించవలసి ఉన్నది. దూరప్రాంతాల్లో ఉన్న ఈ భూములు కలిగి ఉన్నవారు ఆందోళనలకు గురి అవున్నారు. తమ పోలము ఎవరి పేరు మీద ఉంటుందో ఎలా అన్యాక్రాంతం అవుతుందని భయంతో ఉన్నారు. కావున భూ హక్కుదారులను దృష్టిలో ఉంచుకొని సర్వేను సమగ్రంగా చేయించవలసిందిగా కలెకటరు గారికి మనవి చేయటం జరిగింది. ఒక రకంగా చూస్తే ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి కాజేసేందుకు వైసిపి పెత్తందారులకు జగనన్న ఒక మంచి ప్లాట్ ఫామ్ ని క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, కాపు సంక్షేమ సేన నెల్లూరు జిల్లా వర్కింగ్ ఇన్చార్జ్ సుధా మాధవ్, షాజహాన్, హేమచంద్ర యాదవ్, మౌనిష్, కేశవ తదితరులు పాల్గొన్నారు.