గోళ్ళాపురం గ్రామ సమస్యల గురించి జనవాణిలో వినతిపత్రం

తిరుపతిలో జరిగిన 4 వ విడత జనవాణి కార్యక్రమంలో భాగంగా గోళ్ళాపురం జనసైనికులు నవీన్ కుమార్, వై.బాబు ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామ ప్రధాన సమస్యలైన పరిశ్రమల నుండి గోళ్ళాపురం గ్రామంలోకి వదులుతున్న కలుషితపు గాలి సమస్య, కలిషితపు నీరు సమస్య, స్థానికులకు ఉద్యోగాల సమస్యల గురించి ఎన్నో అడ్డంకులను ఎదుకొన్టు చివరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు జనసేన పిఏసి ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ లకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ఈ సమస్యల గురించి ఒక వీడియో కూడ ఇవ్వడం జరిగింది. గ్రామ సమస్యల గురించి పవన్ కళ్యాణ్ హిందూపురం నియోజకవర్గానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ బలంగా మాట్లాడతారని నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది. గోళ్ళాపురం గ్రామ సమస్యలని పవన్ కళ్యాణ్ వరకు తీసుకెళ్లిన మడం వెనక్కి తిప్పని జనసైనికులైన నవీన్ కుమార్, వై బాబు లకు గోళ్ళాపురం గ్రామ జనసేన తరుపున అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. అలాగే మాకు అన్ని విధాలుగా సహకరించిన హిందూపురం జనసేన ఇంఛార్జి ఆకుల ఉమేష్ మరియు హిందూపురం జనసేన వీర మహిళ మని ప్రియ దలవతం ఇతర జనసేన నాయుకులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి జనసైనికుడు పోరాట దీరులుగా తయారవుతూ, జనసేన పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నామని అన్నారు.