దాసరి రాజు, చంద్రమోహన్ లకు బెంతో ఒరియాల వినతిపత్రం

ఇఛ్ఛాపురం, ఆదివారం ఇఛ్ఛాపురం నియోజకవర్గంలో శంఖారావం మహాసభ కార్యక్రమంలో జనసేన సమన్వయ కర్త దాసరి రాజు మరియు జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ లకు బెంతో ఒరియా గిరిజన కుల సమస్యను గూర్చి ప్రసంగించాలని కులస్తుల జాయింట్ సెక్రటరీ బృందావన్ బిసాయి, కమిటీ సభ్యులు మేఘనాత్ బిసాయి, గోపి బిసాయి వినతిపత్రం అందజేశారు. వివరాలలోకి వెలితే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి 2003 వరకు తాతలు, తండ్రులు కుల ధ్రువీకరణ గుర్తింపు పొందిన పత్రాలు పొంది ఉన్నారని తరువాత అకారణంగా తమ కులధ్రువ నివాస పాత్రలు రెవెన్యూ అధికారులు నిలిపి వేశారని ఎటువంటి ప్రభుత్వ ఆదేశాలు, జీఓ, మెమో జారీ లేకుండా ఆపేశారని వారి ఆవేదనను దాసరి రాజుతో విన్నవించారు. అనంతరం ఇచ్ఛాపురం ఇంచర్జ్ దాసరి రాజు బెంతో ఒరియా గిరిజనులను ఉద్దేశించి ప్రస్తావిస్తు ఈ ఇచ్ఛాపురం నియోజకవర్గంలో గల బెంతో ఒరియా కులస్తులను సాస్విత పరిష్కారం చేయాలని కుల గుర్తింపు లేక ఇక్కడ బెంతో ఒరియలు, విద్యార్థులు ప్రభుత్వ పథకాలు అందక వివిధ సమస్యలు ఉన్నాయని సరైన ఉపాధి లేక హోటల్ లో కూలీలుగా మారిన పరిస్థితిని అధికారం రాగానే పరిష్కారం చేయాలని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకి, కింజరాపు రామ్మోహన్ నాయుడు లకు సభా ముఖంగా తెలిపారు. ప్రసంగించిన దాసరి రాజుకి బెంతో ఒరియా కులస్తులు ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో తెలుగు దేశంపార్టీ మరియు జనసేన పార్టీ ప్రధాన నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.