కుల ధ్రువీకరణపై మదాసి కురువ పరిరక్షణ సమితి వినతి పత్రం

గుంతకల్ నియోజకవర్గం: గుంతకల్ మండలంలోని అయ్యవారిపల్లిలో గురువారం గుత్తిలో జరగనున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ మదాసి కురువ, మదారి కురవ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సభ్యులు గురువారం గుంతకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆర్ జితేందర్ గౌడ్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ మదాసి కురువ, మదారి కురవ ఎస్.సి జాబితాలో ఉన్న మా కుల ధ్రువీకరణ పత్రం దీనికి సంబంధించిన అధికారులు మాకు ఇవ్వడం లేదంటూ మా సమస్యను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తెలియజేయండి అని గుంతకల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఆర్ జితేంద్ర గౌడ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.