జనవాణిలో అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితుల సమస్యపై వినతి

తిరుపతి, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ ఉంటారు, జనసేన ఉంటుంది, జనసైనికులు ఉంటారు అని మళ్ళీ నిరూపించారు. ఆదివారం తిరపతిలో జిఆర్ఆర్ కన్వెన్షనల్ హాల్ లో జరిగిన జనవాణిలో అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితుల సమస్యను, వాళ్ళ ఘోషను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి నందలూరు గురివిగారి వాసు మందపల్లి జన సైనికుడు నరహరి వరద బాధితులు రాజ, శ్రీను, శివసాయి తీసుకవెళ్ళారు. పవన్ కళ్యాణ్ స్పందించి అన్ని ఫోటోలు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకొని సీఎం జగన్ రెడ్డి స్వయంగా వచ్చి చెప్పిన వాగ్దానాలు ఒకటి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అందలేదు. సీఎం సొంత జిల్లా పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏంటో ఆలోచించాలి అని ఇది ప్రభుత్వ వైఫల్యం అని నిలదీసారు. ఈ సమస్య గురించి నేను సిద్ధవటం సభలో కూడా అందుకే మాట్లాడాను. కచ్చితంగా సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చి తగిన న్యాయం జరిగే విధంగా చూస్తానని, అలాగే దసరా తరువాత తిరుపతి నుంచి మొదలు పెట్టబోయే యాత్ర అప్పుడు ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు ఉంటాను అప్పటికి పూర్తి స్థాయిలో వారికి ఇవ్వవలసిన నష్ట పరిహారం అందకుంటే అప్పుడు స్వయంగా వచ్చి మందపల్లిలో పర్యటించి వారికి నష్టపరిహారం అందేవిధంగా ప్రభుత్వం మీద వత్తిడి తీసుకవస్తానని హామి ఇచ్చారు అని గురివిగారి వాసు తెలియజేశారు.