రామభద్రపురం ఎం.ఆర్.ఓ మరియు బొబ్బిలి డివిజినల్ రెవెన్యూ అధికారికి వినతిపత్రం

విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గం, రామభద్రపురం మండల కేంద్రంలో వైసిపి నాయకులు ప్రభుత్వం భూమిని కబ్జా చేస్తున్నా.. స్థానిక అధికారులు చూసి, చూడనట్లు వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు ఆగ్రహం వ్యక్తం చేసారు. సర్వే నెంబర్ 98/1లో గల 56 సెట్లు 1966 లో ముడడ్ల పద్మనాభం ప్రభుత్వానికి దానంగా ఇచ్చారని, గతంలో ఆ స్థలంలో వెలుగు కార్యాలయం ఉండేదని, ఇటీవల ప్రైవేట్ వ్యక్తులు జేసీబీతో కూల్చివేసి ఆక్రమించారని తెలిపారు. గత 50 సంవత్సరాల నుంచి అక్కడ కొంతమంది నివాసం ఉంటున్నారు. పేదవాళ్ళని అక్కడ స్థానిక ఆక్రమార్కులు బెదిరింపులు చేస్తున్నారని తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రామభద్రపురం ఎం.ఆర్.ఓ కి, మరియు బొబ్బిలి డివిజినల్ రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు సంచాన గంగాధర్, రామభద్రపురం మండల నాయకుడు మహంతి ధనుంజయ, మండల జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు, గారా గౌరీ శంకర్, అల్లు రమేష్, మోతీదాస్, మారడాన రవి, మామిడి దుర్గ ప్రసాద్, జనసైనికులు పోతుల శివశంకర్, చీమల సతీష్, శ్యామ్ పాల్గొన్నారు.