కేంద్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సహాయ మంత్రికి వినతిపత్రం

అవనిగడ్డ, మోపిదేవి గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి దర్శనార్థం విచ్చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సహాయ మంత్రివర్యులు శ్రీమతి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ పెదకళ్ళేపల్లి జనసేన పార్టీ నాయకులు అరజా కిరణ్ కాంత్ మర్యాదపూర్వకంగా కలిసి పెదకళ్ళేపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత మరియు నిధుల లేమి గురించి సర్పంచ్ సంధ్యారాణి తరపున అర్జీ ఇవ్వడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సిబ్బంది కొరతతో రోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉన్న సిబ్బందికి పని భారమవుతుందని గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆసుపత్రి కనీస అవసరాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని దానివల్ల ఆసుపత్రిలో కనీస ఖర్చులకు కూడా ఇబ్బంది ఏర్పడుతుందని గౌరవ మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. స్పందించిన మంత్రి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వారిని ఈ విషయమై చర్య తీసుకోమని ఆదేశించడం జరిగింది.