రాయపూడిలో పెత్తందారీ వ్యవస్థ నడుస్తోంది: గాదె

  • స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా రాయపూడిలో నడుస్తున్న పెత్తందారీ వ్యవస్థ: గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం, రాయపూడిలో రోడ్డు ప్రక్కన ఉన్న చిన్న బడ్డి కోట్టును అదికారులు కూల్చడంపై స్పందించిన జనసేన నాయకులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా రాయపూడిలో మాత్రం పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని మడిపడ్డారు. సదరు విషయంపై సంబందిత అదికారులకు కంప్లైంట్ ఇచ్చారు. అనతరం ఆయన మాట్లాడుతూ..

*గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలో మల్లెల హరింద్రనాధ్ చౌదరి పెత్తనం నడుస్తోంది

*ఇన్ఛార్జ్ పంచాయితీ సెక్రటరీ పెత్తనం సాగించడం జరుగుతోంది

*ఇక్కడ అనేక కొట్లు, విగ్రహాలు అడ్డంగా ఉండగా రోడ్డు ప్రక్కన ఉన్న చిన్న బడ్డి కోట్టు అడ్డమొచ్చిందా..?

*జనసేన పార్టీ నుంచి పంచాయితీ సెక్రటరీ శ్రీనివాస్ ని హెచ్చరిస్తున్నా

*హరింద్రనాధ్ చౌదరి పర్మిషన్ తో ఇక్కడ కొట్టు పెట్టుకోవాలా..?

*కొట్టు కూల్చడం పై పంచాయితీ సెక్రెటరీ పై కేసు పెడతాను

*పంచాయతీ సెక్రెటరీ కులాల ప్రస్తావన తెస్తూ… దూషణలకు దిగి, రెచ్చగొట్టడం కరెక్టేనా..?

*భయపెట్టి ఇక్కడ వారిని పాలించాలని హరింద్రనాధ్ చూస్తున్నారు..
జనసేన తరుపున ఈ పరిణామాలని, తీవ్రంగా ఖండిస్తున్నాం…

*సదరు విషయాన్ని పంచాయతీ ఆఫీస్ వారిని కనుక్కోవటానికి వెళ్లగా సిబ్బంది ఎవ్వరు లేకపోవటంతో మండల ఎంపీడీఓ కు మరియు తుళ్లూరు ఎస్.హెచ్.ఓ కు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, త్రినాద్, తుళ్లూరు మండల అధ్యక్షులు యర్రగోపుల నాగరాజు, మండల ఉపాధ్యక్షులు బండి సునీల్, నెల్లూరి రాజేష్, అరివేణి శివకృష్ణ, ప్రధానకార్యదర్శులు బేతు సురేంద్ర, షేక్ హాఫిజ్, కుప్పాలా సుబ్బారావు (భాధితుడు) మరియు కమిటీ మెంబెర్స్ పాల్గొన్నారు..