పినపాక మండల స్థాయి జనసేన సమావేశం

తెలంగాణ, పినపాక నియోజకవర్గ జనసేన పార్టీ కో-ఆర్డినేటర్లు యార్లగడ్డ శ్రీనివాసరావు మరియు కోసన అంకబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన పినపాక మండల స్థాయి జనసేన పార్టీ సమావేశంలో వచ్చే నెల జరగబోవు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున పినపాక నియోజకవర్గం నుండి పోటీ చేయుట గురించి, పోటీ చేయు అభ్యర్థిపై జనసేన కార్యకర్తల అభిప్రాయం, ఎన్నికల నియమావళి, కార్యకర్తల కార్యాచరణ, పోలింగ్ బూత్ ఏజెంట్ నియామకం గురించి ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది.