సర్పంచ్ దున్నా సత్యనారాయణను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: తాళ్లరేవు మండలం, పి. మల్లవరం పత్తిగొంది గ్రామానికి చెందిన సర్పంచ్ దున్నా సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో ఇంటిదగ్గర కోలుకుంటున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ సోమవారం దున్నా సత్యనారాయణను పరామర్శించి, వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విళ్ల వీర, పోసింశెట్టి సూర్యప్రకాష్, తాళ్లూరి ప్రసాద్, చిట్టూరి నాగేశ్వరరావు, కుడిపూడి కృష్ణ, పంపన లక్ష్మణరావు, తాడ్డి సంతోష్, నూకల సురేష్, కాట్నం దొరబాబు, కుడిపూడి వీరబాబు, దూళిపూడి వీరబాబు యంటపల్లి కుటుంబరావు, రాయుడు శ్రీనివాసరావు, నీలా శివ సుబ్రహ్మణ్యం మొదలగు వారు పాల్గొన్నారు.