మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలను ఖండించిన పితాని

ముమ్మిడివరం నియోజకవర్గం: రాష్ట్ర మంత్రి జోగి రమేష్ శనివారం మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మాటలు వక్రీకరిస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఆదివారం పితాని బాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. జోగి రమేష్ గారు మీరు నోరు దగ్గర పెట్టికుని మాట్లాడాలని ముందు మీ మంత్రి పదవికి న్యాయం చెయ్యమని అన్నారు. రూల్ అఫ్ లా విధంగా మన చట్టం నడుస్తుందా అని అన్నారు. రాష్ట్రంలో మీ నాయకుడు రాక్షసపాలన, నియంతృత్వ పాలనా నడుస్తుంది అని రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చాక బి. ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు.
సీఎం పదవి ఉన్నంత మాత్రాన గొప్పవారు అవరని ఒక సామాన్య మానవుడు, వ్యవసాయం చేసుకునే కూలి కార్మికుడు మంచి మనసుంటే ముఖ్యమంత్రి గారి కంటే ఆదర్శంగా ఉంటాడని అన్నారు. మీరు చేసే అవినీతి అంతా ప్రజలకు చూపించి మీకు బుద్దిచెప్పే రోజు దగ్గరలో ఉందని అన్నారు. ఇక్కడనుండైనా సిగ్గుతెచ్చుకుని పరిపాలన మీద దృష్టి పెట్టమని సూచించారు. మా నాయకుడు మంచి ఆశయంతో వచ్చాడు రాబోయే రోజుల్లో రామరాజ్యాన్ని స్థాపిస్తామని బాలకృష్ణ అన్నారు.