సూర్య మల్టీ స్పెషాలిటీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పితాని

  • ముమ్మిడివరం నియోజకవర్గంలో పితాని సుడిగాలి పర్యటన
  • పర్యటనలో భాగంగా పలుకార్యక్రమంలో పాల్గొని, పలువురిని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ తాళ్ళరేవు మండలం బైపాస్ రోడ్డులో గల సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంబోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఐ పోలవరం మండలం, ఐ పోలవరంలో శ్రీ శ్రీ శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి సంబరం మహోత్సవంలో పాల్గొన్నారు. అదేవిధంగా మంగా పాలెంలో శ్రీ శ్రీ శ్రీ భాగిర్తమ్మ అమ్మవారి నూతన ఆలయం విగ్రహ ప్రతిష్ట మహాత్సవంలో పాల్గొన్నారు. అనంతరం కాట్రేనికోన మండలం, కంది కుప్ప గ్రామంలో నూకల దుర్గ బాబు గృహప్రవేశం వేడుకల్లో పాల్గొన్నారు. నడవ పెళ్లి గ్రామానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న సఒసాని రాంబాబు ను పరామర్శించారు. మరియు అదే గ్రామానికి చెందిన కంటి ఆపరేషన్ చేసుకున్న మట్టపర్తి సత్యనారాయణను పరామర్శించారు. వీరి వెంట జిల్లా ఉపాధ్యక్షులు అధ్యక్షులు సానబోయిన మల్లికార్జున రావు, సంసాని పాండురంగారావు, మట్టపర్తి శంకర్, భీమాల సూరి నాయుడు, పిల్లి గోపి మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.