పిఠాపురం జనసేన ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

పిఠాపురం నియోజకవర్గం, రాపర్తి గ్రామం నందు పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సమక్షంలో భారీ ఎత్తున ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో రాపర్తి గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా ఇంచుమించు 500 పైచిలుకు రోగులు ఈ వైద్య శిబిరంలో పాల్గొని బిపి, రక్త పరీక్షలతో పాటు మందులు కూడా ఉచితంగా పొందడం జరిగింది. ముందుగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వైద్య శిబిరాన్ని ప్రారంభించి పిఠాపురం నియోజకవర్గంలో డాక్టర్ పిల్లా శ్రీధర్ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉచితంగా వైద్యం వందేలాగా ముందు ముందు కూడా ఉచితంగా అనేక రకాల వైద్య శిబిరాలు డాక్టర్ పిల్లా శ్రీధర్ తో కలిసి ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ కూడా సామాన్యునికి మెరుగైన వైద్యం అందేలాగా పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ సమాజంలో ప్రతి మనిషికి కావలసినవి మూడే మూడని అవి విద్య, వైద్యం, న్యాయం అని, అవి ఈ రాష్ట్రంలో కరువయ్యాయని రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా విద్య, వైద్యం మరియు న్యాయం ప్రతి సగటు మానవునికి అదే విధంగా పరిపాలన కొనసాగుతుందని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ పథకాలు అయితే ఇస్తుందో అదే పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాలకు నాంది పలికి ఉత్తమమైన పరిపాలనందించే దిశగా జనసేన ప్రభుత్వం ఉంటుందని దానికి మీరందరూ సహకారం అందించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ని సీఎం చేసుకునే బాధ్యత మనందరికీ ఉందని డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియా ముందు వాపోయారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్, వీరాంరెడ్డి అమర్, కీర్తి చంటి, జ్యోతుల శ్రీనివాస్, ఎక్స్ సర్పంచ్ గరగా సత్యనందరావు, బొజ్జ గోపికృష్ణ, ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివ, గోపి సురేష్, రావుల వీరబాద్రరావు, సోదే రవికిరణ్ (బాబీ) కొత్తపల్లి రాజు, మైలపల్లి రవి, పలివెల్ల నాని పెన్నుపోతుల వీరబాబు, కాళ్ళ రాజు, మర్రి దొరబాబు, కట్టా నానాజీ, దువ్వ వీరబాబు, గేదెల వెంకటరావు, మాదేపల్లి పద్మరాజు, కర్నిడి దొరబాబు, గుర్రం గంగాధర్, కేసిరెడ్డి బుల్ రాజు, పల్నాటి మధుబాబు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.