పిఠాపురం టౌన్: ఉప్పాడ సెంటర్లో జనసేన నిరసన

  • వారాహి విజయ యాత్ర విజయవంతం కావడం జీర్ణించుకోలేని వైసిపి ప్రభుత్వం..!!

పిఠాపురం: సోమవారం పిఠాపురం టౌన్ లో వాలంటీర్లు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఘటనను ఖండిస్తూ మంగళవారం జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పిఠాపురం టౌన్ లో జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి మరియ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ వీరమహిళ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి తోలేటి శిరీష, జడ్పీటీసీ అభ్యర్ధి ఊట నానిబాబు, ఆధ్వర్యంలో పిఠాపురం టౌన్ అధ్యక్షుడు బుర్రా సూర్యప్రకాష్, పిఠాపురం రూరల్ మండల అధ్యక్షుడు గోపు సురేష్, గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, టౌన్ మహిళ అధ్యక్షులు కోలా దుర్గ, పుణ్యమంతుల సూర్యనారాయణమూర్తి, మర్రి దొరబాబు, గంజి గోవిందు, మేళం రామకృష్ణ, కసిరెడ్డి నాగేశ్వరరావు, గొల్లపల్లి గంగ, పెద్దింటి శివ, బుద్దాల చంటి, వెలుగుల లక్ష్మణ్, తాటికాయల ప్రసాద్, సామినిడి అప్పారావు, గరగ బాబి, అడబాల వీర్రాజు, కొప్పన రమేష్, కంద సోమరాజు, మేడిశెట్టి కామేష్, అల్లం కిషోర్, పెద్దిరెడ్ల భీమేశ్వరరావు, మరియు జనసైనికులు, వీరమహిళలు మంగళవారం ఉదయం నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసుల అడ్డుకోవడం జరిగింది. ఈ అడ్డుకున్న సమయంలో తోపులాటలో ఇంచార్జ్ శేషుకుమారిని మరియు చల్లా లక్ష్మి తోలేటి శిరీషలను రోడ్డుపై ఈడ్చారు. దీంతో జనసైనికులు, వీరమహిళలు పూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జనసేన అధ్యక్షులకు పాలభిషేకం నిన్న మా అధ్యక్షులు ఫోటోను దగ్గనం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టౌన్ ఎస్.ఐ కి ఫిర్యాదు చేశారు.