2 లక్షల విరాళం అందజేసిన మాజీ మేయర్ పోలసపల్లి సరోజ

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి తోడుగా రైతులకు అండగా కాకినాడ ప్రథమ మేయర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పోలసపల్లి సరోజ రైతులను ఆదుకునే విధంగా తన వంతు బాధ్యతగా జనసేనపార్టీకి 2 లక్షల రూపాయలను మంగళవారం నాడు మంగళగిరి పార్టీ ఆఫీస్ నందు, పార్టీ అధ్యక్షులు వారు ఎదుట ప్రకటించిన విషయం విధితమే, ఆ విషయమై.. శుక్రవారం జనసేనపార్టీ అకౌంట్ ద్వారా పార్టీకి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీమతి పోలసపల్లి సరోజ మాట్లాడుతూ.. మన పార్టీ అధినేత చేపట్టిన ఈ బృహత్కార్యంలో మేముసైతం ప్రథమంగా భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, మరియు అధినేత చేసిన చేస్తున్న విరాళాలు మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూనే ఉంటాయి, మరింత స్పూర్తిని కలుగజేస్తూ ఉంటాయని, అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలి అని సంకల్పించిన పవన్ అన్నకు తోడుగా ఉండే క్రమంలో అవకాశం ఉన్న ప్రతీవారు భాగస్వామ్యం కావాలని ఆమె తెలియజేశారు.