హీరో నిఖిల్ ని సత్కరించిన పోలీస్ కమిషనర్ సజ్జనార్

టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సత్కరించారు. కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా నిఖిల్ చేసిన సేవలను గుర్తించి ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఈ విషయాన్ని నిఖిల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో చేసిన పనులు, ఫ్రంట్ లైన్ కొవిడ్ పోలీస్ వారియర్లను కలవడం వంటి పనులకు గుర్తింపుగా సజ్జనార్ సార్ సత్కరించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని నిఖిల్ చెప్పాడు. సజ్జనార్ సత్కరిస్తున్న వీడియోను షేర్ చేశాడు. సత్కార కార్యక్రమం సజ్జనార్ కార్యాలయంలో జరిగింది.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో నిఖిల్ పలు సేవా కార్యక్రమాలను చేపట్టాడు. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సెంట్రేటర్లు, ఇతర వైద్య పరికరాలను అందించాడు. తన వంతుగా బాధితులను ఆదుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు నిఖిల్ నటిస్తున్న ’18 పేజెస్’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం నిఖిల్ డబ్బింగ్ చెపుతున్నాడు.

కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ అనేది యునైటెడ్ స్టేట్స్‌లో అత్యున్నత పౌర పురస్కారం. మరణానంతరం ఈ పురస్కారం పొందనున్న మొదటి వ్యక్తి గాంధీ కానున్నారు. జార్జ్ వాషింగ్టన్, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, మదర్ థెరిస్సా, రోసా పార్క్స్ వంటి గొప్ప వ్యక్తులకు లభించిన గౌరవం.. అందుకున్న మొదటి భారతీయుడుగా గాంధీ నిలిచారు.